ETV Bharat / bharat

'తాలిబన్ల​తో చర్చల ముఖ్య ఉద్దేశం అదే' - Arindam Bagchi

ఖతార్​లో తాలిబన్ల నేతతో భారత రాయబారి సమావేశంపై(India Taliban Talks) క్లారిటీ ఇచ్చింది విదేశాంగ శాఖ. అఫ్గాన్​(Afghanistan news) భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోకుండా చూడటం, అక్కడి భారతీయులను వెనక్కి రప్పించటం వంటి అంశాలను తెలియజేసేందుకే భేటీ అయినట్లు స్పష్టం చేసింది.

India on Afghanistan
అరిందమ్​ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి
author img

By

Published : Sep 2, 2021, 6:40 PM IST

అఫ్గానిస్థాన్​(Afghanistan Taliban) భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్​ రాజధాని దోహాలో తాలిబన్​ నాయకుడు షేర్​ మొహమ్మద్​ అబ్బాస్​ స్టెనెక్జాయ్​తో.. భారత రాయబారి దీపక్​ మిత్తల్​ భేటీ(India Taliban Talks) అయిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించింది.

"అఫ్గాన్​ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై ఆందోళనలను తెలియజేయటం, అఫ్గాన్​లోని భారతీయుల భద్రత, వారిని వెనక్కి రప్పించటం కోసమే దోహాలో భారత్​ సమావేశమైంది. వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది."

- అరిందమ్​ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి.

తాలిబన్లతో భారత ప్రతినిధి సమావేశం నేపథ్యంలో వారి ప్రభుత్వాన్ని గుర్తిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు బాగ్చీ. 'ఇది కేవలం సమావేశమే. ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది,' అని తెలిపారు. మరిన్ని సమావేశాల నిర్వహణపైనా స్పందించారు బాగ్చీ. తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి వార్తలను వ్యాప్తి చేయాలనుకోవట్లేదన్నారు. ప్రస్తుతం కాబుల్​ విమానాశ్రయం మూసివేసి ఉందని, తెరుచుకోగానే.. భారతీయుల తరలింపును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: India Taliban Talks: 'కశ్మీర్ కోసం తాలిబన్లతో భారత్ డీల్​!'

తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.