ETV Bharat / bharat

'సరిహద్దులో శాంతితోనే ద్వైపాక్షిక సంబంధాల పురోగతి' - సరిహద్దు చర్చలపై భారత్ చైనా ప్రకటన

సరిహద్దులో శాంతియుత పరిస్థితులు నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సాధ్యమవుతుందని 11వ విడత సైనిక చర్చల్లో భాగంగా చైనాకు భారత్ స్పష్టం చేసింది. సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చేందుకు.. చర్చలు కొనసాగించాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చినట్లు భారత సైన్యం తెలిపింది.

india china
భారత్ చైనా సరిహద్దు చర్చలపై ప్రకటన
author img

By

Published : Apr 10, 2021, 8:21 PM IST

తూర్పు లద్దాఖ్​లో కొత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థిరత్వం కొనసాగించాలని 11వ సైనిక చర్చల్లో భారత్, చైనా నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి.

శుక్రవారం జరిగిన చర్చలపై అధికారిక ప్రకటన విడుదల చేసిన భారత సైన్యం.. తూర్పు లద్దాఖ్​లో పరిస్థితులపై అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నట్లు పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి ఉండాలంటే సరిహద్దులో శాంతి తప్పనిసరని స్పష్టం చేసినట్లు వివరించింది. సైన్యాల మధ్య ఘర్షణను నివారించాలంటే.. బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని ఆ దేశానికి సూచించింది.

"తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై ఉన్న సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలు అందించుకున్నాయి. సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. సరిహద్దులో శాంతిని పరిరక్షిస్తూ, ఎలాంటి నూతన ఘటనలు జరగకుండా.. క్షేత్రస్థాయిలో స్థిరత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. ఇతర ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరిగితే.. సరిహద్దులో పూర్తిస్థాయిలో శాంతి నెలకొల్పే అవకాశం ఉంటుందని.. అది ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశాం."

-భారత సైన్యం ప్రకటన

ఇరుపక్షాలు చర్చలను కొనసాగించాలని నిర్ణయించినట్లు సైన్యం తెలిపింది. ఇరుదేశాల అధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని మార్గదర్శకంగా తీసుకొని.. మిగిలిన సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని అనుకున్నట్లు పేర్కొంది.

గతేడాది ఏప్రిల్ నుంచి సరిహద్దులో ఇరుదేశాల సైన్యం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. మే 5న పాంగాంగ్ సరస్సు సమీపంలో జరిగిన హింసాత్మక ఘటన.. పరిస్థితులను మరింత జఠిలం చేసింది. ఇరుపక్షాలు వేలకొద్ది బలగాలను మోహరించాయి. పలు విడతలుగా జరిగిన సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా.. ఫిబ్రవరిలో ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాయి.

ఇదీ చదవండి: తెరవెనుక భారత్​-పాక్​ చర్చలు.. నిజమెంత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.