Complaint Against Owner Of Dog : కుక్క కరించిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఓ మహిళకు చెందిన బైకులను తగలబెట్టాడు వ్యక్తి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది
కొత్తనూర్కు చెందిన పుష్పను అదే ప్రాంతంలో ఉండే ఓ కుక్క కరిచింది. దీంతో ఆ కుక్క యజమాని నంజుంద బాబు సహా అతడి తల్లి గౌరమ్మపై కొత్తనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు పుష్ప. ఇదిలా ఉండగా.. మరోవైపు తనపై ఫిర్యాదు చేసిన పుష్పను చిట్టి డబ్బులు ఇవ్వాలని కోరింది గౌరమ్మ. మీ కుక్క కరవడం వల్ల ఆస్పత్రికి డబ్బు ఖర్చు అయ్యిందని.. అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఇస్తానని గౌరమ్మకు చెప్పింది పుష్ప. ఇంతలోనే అక్కడకు వచ్చిన కుక్క యజమాని నంజుంద బాబు.. తమపై ఫిర్యాదు చేసిన వారిని వదలనంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన నంజుంద బాబు.. పుష్ప ఇంటి ముందు ఉన్న ఆమె కుమారుల బైకులకు నిప్పంటించాడు. అనంతరం కొత్తనూర్ పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేసింది పుష్ప. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నంజుంద బాబును అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
పెంపుడు కుక్క మొరిగిందని గొడవ.. యజమానిపై కాల్పులు
అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్లోనూ ఈ తరహా ఘటనే జరిగింది. పక్కింటి పెంపుడు కుక్క మొరుగుతోందని ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబంపై కాల్పులు జరిపారు. పెంపుడు కుక్క యజమానితో పాటు అతడి ఇద్దరు కుమారులపై నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. నిందితులను అఠన్నీ, చవాన్నీని అరెస్టు చేశారు.
బాధితుడు సుశీల్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. అయితే, ఆ కుక్క పదేపదే అరుస్తోందని నిందితులు తరచుగా కోప్పడేవారు. ఇదే విషయంలో గొడవ జరగ్గా.. నిందితులు సుశీల్‌పై కాల్పులు చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రైతు ప్రాణాలు రక్షించిన గోమాత.. యజమాని కోసం చిరుతతో ఆవు ఫైట్