ETV Bharat / bharat

వెల్లివిరిసిన మతసామరస్యం.. వృద్ధురాలికి ముస్లిం యువత అంత్యక్రియలు.. అన్నం పెట్టినందుకే!

చనిపోయిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలికి ముస్లిం యువకులు హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మత సామరస్యం వెల్లివెరిసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్​లో వెలుగు చూసింది.

communal harmony in madhya pradesh news
హిందూ వృద్ధురాలికి ముస్లిం యువత అంత్యక్రియలు
author img

By

Published : Jan 14, 2023, 11:23 AM IST

Updated : Jan 14, 2023, 2:23 PM IST

మధ్యప్రదేశ్​లో మత సామరస్యం వెల్లివిరిసింది. చనిపోయిన ఓ 90 ఏళ్ల హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు ముందుకొచ్చారు. తల్లిలాగా ప్రేమించే ఆమె పాడెను మోసుకుని వెళ్లి హిందూ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు.

సమాచారం ప్రకారం..
గాల్వియర్​.. రైల్వేకాలనీలోని దర్గా ప్రాంతంలో నివసించే రామ్​దేహి మహోర్(90) మృతిచెందింది. ఆమెకు కుమారుడు లేడు. ఉన్న ఒక్క కూతురు కూడా దిల్లీలో ఉంది. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆ వృద్ధురాలి బంధువులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుక అడుగు వేశారు. దీంతో గాల్వియర్​లో నివసిస్తున్నకొందరు ముస్లిం యువకులు ముందుకు వచ్చారు. ఆమెను తల్లిలా భావించిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి షకీర్ ఖాన్ తన సోదరుడు, స్నేహితులతో కలిసి ఆమె పాడెను సిద్ధం చేశారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో దిల్లీలో ఉంటున్న రామ్​దేహి కుమార్తె షీలా గాల్వియర్ వచ్చారు. తల్లి చితికి ఆమె నిప్పంటించారు.

గాల్వియర్​లో నివసిస్తున్న ఆ వృద్ధురాలి బంధువులు ఆమెను పట్టించుకునేవారు కాదు. దీంతో ఆమె చాలా కాలంగా దర్గా ప్రాంతంలో ఒంటరిగానే ఉంది. అయితే అక్కడ నివసిస్తున్న ముస్లిం కుటుంబాలకు ఆమె అప్పుడప్పుడు భోజనం పెట్టేది. కులమతాలకు అతీతంగా వృద్ధురాలు అందరితో మెలిగేది. చుట్టుపక్క ఉన్నవాళ్లు కూడా ఆమెను మంచిగా చూసుకునేవారు. అందుకే ఆమెను తల్లిగా భావించి ముస్లిం యువకులు అంత్యక్రియలు నిర్వహించారు.

"హిందూ-ముస్లిం అంటూ ఏదో ఒక విధంగా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా మంది చూస్తున్నారు. అయితే అటువంటి భావన లేకుండా సహాయం చేసేందుకు మేము ఎప్పుడూ ముందుండి ఇతరులకు సహాయపడతాం" అని ముస్లిం యువకులు అంటున్నారు. వృద్ధురాలి కుమార్తె కూడా తమకు సహాయం చేసిన ముస్లిం సోదరులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పింది.

Last Updated : Jan 14, 2023, 2:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.