ETV Bharat / bharat

త్రివిధ దళాల్లో సేవలందించిన 100ఏళ్ల ప్రితిపాల్ సింగ్​ కన్నుమూత - శతాధిక కర్నల్​ ప్రితిపాల్ సింగ్

Colnel prithipal singh gill: త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ కర్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్ ఆదివారం​ కన్నుమూశారు. మరో ఐదురోజుల్లో 101వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా.. ఆయన తుదిశ్వాస విడిచారు.

Colnel prithipal singh gill
ప్రితిపాల్ సింగ్​ కన్నుమూత
author img

By

Published : Dec 6, 2021, 1:32 PM IST

Colnel prithipal singh gill: గగనతలంలో శత్రువులను యుద్ధ విమానాలతో ఎదుర్కొన్నారాయన. సముద్రాలను ఆక్రమించేందుకు వచ్చినవారిపై యుద్ధనౌకలతో పోరాడారు. సరిహద్దులు దాటేందుకు కుట్రలు పన్నిన ప్రత్యర్థులను తుపాకీలతో మట్టికరిపించారు. ఆయనే.. మాజీ కర్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్​​.

Pritipal singh gill 3 defence wings: భారత వైమానిక దళం, నౌకా దళం, సైన్యం(ఆర్మీ).. ఇలా మూడు విభాగాల్లో దేశానికి సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన ప్రితిపాల్​ సింగ్ గిల్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. హరియణా చండీగఢ్​లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. మరో ఐదు రోజుల్లో(డిసెంబరు 11న) తన 101వ పుట్టినరోజును ప్రితిపాల్ సింగ్​ జరుపుకోనుండగా.. ఈ అనూహ్య ఘటన జరగడం గమనార్హం.

Colnel prithipal singh gill
ప్రితిపాల్​ సింగ్​ గిల్​
Colnel prithipal singh gill
ప్రితిపాల్​ సింగ్ ​(పాత ఫొటో)

త్రివిధ దళాల్లో..

తొలుత.. రాయల్​ ఇండియన్​ వైమానిక దళంలో పైలట్​గా సేవలందించారు ప్రితిపాల్​ సింగ్​. ఆ తర్వాత నావికా దళంలో చేరి.. భారీ స్థాయి సముద్ర ప్రయాణాలు చేశారు. అనంతరం.. 1965లో భారత్​-పాకిస్థాన్​ యుద్ధ సమయంలో సైన్యంలో అడుగుపెట్టారు. అక్కడ గన్నర్​ ఆఫీసర్​గా విధులు నిర్వర్తించారు. అసోం రైఫిల్స్​ విభాగాధిపతిగానూ మణిపుర్​లో పనిచేశారాయన.

ఇలా సుదీర్ఘ కాలంలో మూడు ప్రత్యేక విభాగాల్లో పనిచేసి ప్రితిపాల్ చరిత్రలో నిలిచిపోయారు. ఆదివారం సాయంత్రం ప్రితిపాల్ సింగ్ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఇదీ చూడండి: బ్రిటిష్​ క్రూరత్వానికి ​ఆ జైలే నిదర్శనం.. అక్కడ నీళ్లు అడిగితే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.