ఆరేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని దిండిగుల్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు కొటైయూర్కు చెందిన అజయ్ రత్నంగా పోలీసులు గుర్తించారు.
ప్రతీకార చర్యగా..
నిందితుడు అజయ్ రత్నం.. తన బంధువు రామకృష్ణ కుమార్తె ఫొటోను కొన్ని వారాల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై రామకృష్ణ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన అజయ్.. ఆదివారం వారి ఇంటికి వెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసి రామకృష్ణ కుమారుడు.. ఆరేళ్ల హరిహర దీపన్‌ను మేడపైకి తీసుకెళ్లి హత్య చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అసలు విషయం బయటపడింది.
ఇదీ చూడండి : నా మంత్రులకు హిందీ రాదు.. సీఎస్‌ను మార్చండి: సీఎం లేఖ