ETV Bharat / bharat

Collector Transfer On Politician Complaint : 70 ఏళ్ల తర్వాత గ్రామానికి నీళ్లు.. ఓపెనింగ్​కు పిలవలేదని పైపులు కట్​! మూడు రోజుల్లో కలెక్టర్ బదిలీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 1:43 PM IST

Collector Transfer On Politician Complaint : ఇంటింటికి తాగు నీటిని అందించే 'జల్​ జీవన్ మిషన్' ప్రారంభోత్సవానికి పిలవలేదని కలెక్టర్​పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు ఓ బీజేపీ నేత. ఈ క్రమంలో మూడు రోజుల్లోనే జిల్లా కలెక్టర్ వేరే చోటికి బదిలీ అయ్యారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Collector Transfer On Politician Complaint

Collector Transfer On Politician Complaint : స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా.. ఆ గ్రామానికి ఇప్పటికి తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకొకసారి ట్యాంకర్లతో వచ్చిన నీటినే పట్టుకుని నిల్వ చేసుకుంటారు. ఆ నీటినే తాగడానికి, వంటకు వినియోగిస్తారు. అది కూడా ఒక మనిషికి 15 లీటర్లు మాత్రమే. ఆ నీరు అయిపోతే కి.మీ మేర నడిచి పక్క గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిందే. ఆ గ్రామమే ఉత్తర్​ప్రదేశ్​.. మీర్జాపుర్ జిల్లాలోని లహురియాదహ్​. వీరి కష్టాలను చూసి స్పందించిన మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్​.. ఇంటింటికి తాగునీరు అందించే పథకం 'జల్​ జీవన్ మిషన్' కింద ఆగస్టు 29న కుళాయిలు వేయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ జరిగింది.

అప్పుడేం జరిగిందంటే?
లహురియాదహ్ గ్రామానికి కుళాయిల ద్వారా తాగు నీరు అందించిన మూడు రోజుల్లోనే మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్ వేరే ప్రదేశానికి బదిలీ అయ్యారు. మరోవైపు కుళాయిల పైపులను గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేశారు. దీంతో లహురియాదహ్ గ్రామానికి మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. ట్యాంకర్లలో వచ్చిన నీటిని పట్టుకుని నిల్వ చేసుకుంటున్నారు. గ్రామంలో చాలా కాలంగా నీటి ఎద్దడి ఉందని లహురియాదిహ్​ గ్రామస్థులు చెబుతున్నారు. తమకు తాగునీటిని అందించిన కలెక్టర్ హఠాత్తుగా బదిలీ కావడంపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక తమ తాగు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Collector Transfer In Politician Complaint
ట్యాంకర్లతో వచ్చిన నీటిని పట్టుకుంటున్న గ్రామస్థులు

గ్రామస్థుల కథనం ప్రకారం.. మీర్జాపుర్ జిల్లా కలెక్టర్​పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు బీజేపీ నేత విపుల్ సింగ్ లేఖ రాశారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని లేఖలో పేర్కొన్నారు. కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమెను బదిలీ చేయాలని కోరారు. అలాగే కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ అడిషనల్ సెక్రటరీ కూడా మీర్జాపుర్ జిల్లా కలెక్టర్ దివ్యా మిత్తల్​.. ఎంపీ ఫండ్​ పనులకు గత ఆరు నెలలుగా అనుమతివ్వడం లేదని యోగికి లేఖ రాశారు. ఈ లేఖలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

సీఎం యోగికి బీజేపీ నేత రాసిన లేఖ

సీఎంకు కేంద్రమంత్రి అడిషనల్ సెక్రటరీ రాసిన లేఖ

Nipah Virus Kerala : మరోసారి ప్రమాదకర వైరస్​ కలకలం.. నిపాతో ఇద్దరు మృతి!.. నిపుణుల కమిటీ ఏర్పాటు

సరిహద్దులో అలజడికి పాక్ కుట్ర.. 200 మంది ముష్కరులతో ప్లాన్!.. దేనికైనా సిద్ధమంటున్న భారత ఆర్మీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.