ETV Bharat / bharat

బృహన్‌ ముంబయిలో చిల్లర జీతాలు - బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్‌ ట్రాన్స్‌పోర్టు

బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్‌ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్‌) ఉద్యోగులు గత కొన్ని నెలలుగా చిల్లర రూపంలో జీతాలు పొందుతున్నారు. దీనికి కారణం.. బెస్ట్‌కు వచ్చిన చిల్లరను తీసుకోవడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించడమేనని ఆ సంస్థ ఉద్యోగులు పేర్కొన్నారు.

Coins
చిల్లర జీతాలు
author img

By

Published : Apr 4, 2021, 6:59 AM IST

బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్‌ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్‌)లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ సంస్థ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా చిల్లర రూపంలో జీతాలు పొందుతున్నారు. దీనికి కారణం.. బెస్ట్‌కు వచ్చిన చిల్లరను తీసుకోవడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించడమేనని ఆ సంస్థ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

బెస్ట్‌ సంస్థ దాదాపు 4 వేల బస్సులను నడపడమే కాకుండా.. 10 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాను అందిస్తోంది. ప్రయాణికుల టికెట్లు, విద్యుత్తు వినియోగదారులు చెల్లించే బిల్లుల్లో అధికంగా చిల్లర ఉంటోంది. బ్యాంకులు ఆ చిల్లరను తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో చేసేది లేక 'బెస్ట్‌' తమ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తోందని అధికారులు వెల్లడించారు.

వచ్చే జీతంలో సగం మొత్తం చిల్లర రూపంలో వస్తున్న కారణంగా.. ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని బెస్ట్‌ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. చిల్లరను డిపాజిట్‌ చేసేందుకు జనవరిలో ఓ ప్రైవేట్‌ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నా.. సాంకేతిక కారణాలతో అది కార్యరూపం దాల్చడం లేదని అధికారులు తెలిపారు. జీతాన్ని నాణేల రూపంలో ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ‘బెస్ట్‌’ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాహుల్ ఓ 'పర్యటక రాజకీయ నేత': షా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.