భాజపాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut News) మరోసారి విమర్శలు గుప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో(2024 General Election India) కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. దాంతో ప్రస్తుత ఏకపార్టీ పాలన ముగుస్తుందని చెప్పారు. మహారాష్ట్ర పుణెలో జేఎస్ కారందికర్ స్మారక ఉపన్యాసం తర్వాత ఆయన(Sanjay Raut News) విలేకరులతో మాట్లాడారు. పుణె ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
"కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కాంగ్రెస్ దేశంలో ప్రధానమైన పార్టీ. ప్రధాన ప్రతిపక్షం కూడా ఆ పార్టీనే. మిగతావి ప్రాంతీయ పార్టీలు."
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ.
రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో భాజపా కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్(Sanjay Raut News) స్పందించారు. దేశ రాజకీయాల్లో భాజపా(Sanjay Raut On Bjp) ఉంటుంది గానీ, ప్రతిపక్ష హోదాలో ఉంటుందని చెప్పారు. "తాము ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని భాజపా చెప్పుకుంటోంది. ప్రపంచంలోనే పెద్ద పార్టీ.. ఎన్నికల్లో ఓడిపోతే... ప్రతిపక్షంగా మారుతుంది. ఉదాహరణకు.. మహారాష్ట్రలో 105 ఎమ్మెల్యేలు ఉన్న భాజపానే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది"అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(Shiv Sena News) పోటీపై సంజయ్‌ను విలేకరులు ప్రశ్నించగా... ప్రస్తుతం తాము దాద్రా నగర్ హవేలీ, గోవా ఎన్నికలపై మాత్రమే దృష్టి సారించామని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. యూపీలో తమ పార్టీ స్థానం చిన్నదే అయినా.. పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
'ఆ భయంతోనే విలేకరులను దూరం'
అంతకుముందు.. స్మారక ఉపన్యాసంలో ప్రస్తుతం మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లను సంజయ్ రౌత్ ప్రస్తావించారు.
"రెండేళ్ల నుంచి కరోనా వైరస్ నిబంధనల పేరుతో మీడియా వ్యక్తులను పార్లమెంటులోని సెంట్రల్ హాలులోకి అనుమతించటం లేదు. కానీ, విలేకరులను అనుమతించకపోవడానికి అసలైన కారణమేంటంటే.. అక్కడికి వారు వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయనే భయమే. అందుకే.. మంత్రులను విలేకరులకు దూరంగా ఉండాలని కేంద్రం చెబుతోంది. ఎమర్జెన్సీ సమయంలో కూడా మీడియాను ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పడు మాత్రం వారిని అడ్డుకుంటున్నారు."
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ.
గంగానదిలో శవాలు తేలడంపై వార్తలను పత్రికలు ప్రచురించిన తర్వాత... ఆయా వార్తా పత్రికల కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపిందని సంజయ్ పేర్కొన్నారు. పది పరిశ్రమలు మీడియా కార్యాలయాలను కొనుగోలు చేశాయని అన్నారు. వాటి వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.
ఇవీ చూడండి: