Coal India Limited Jobs 2023 : ఇంజినీరింగ్ పూర్తి చేసి GATE-2023లో మంచి స్కోర్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌లో మొత్తం 560 మేనేజ్మెంట్ ట్రైనీ E-2 గ్రేడ్ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే సెప్టెంబర్ 13(బుధవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు!
560 పోస్టులు.
ఈ పోస్టులు!
మేనేజ్మెంట్ ట్రైనీ(E-2 గ్రేడ్) పోస్టులు.
ఈ విభాగాల్లో..!
- మైనింగ్- 351 పోస్టులు
- సివిల్- 172 ఖాళీలు
- జియాలజీ- 37 పోస్టులు
ఏజ్ లిమిట్!
Coal India Limited Jobs Age Limit : 2023 ఆగస్టు 31 నాటికి అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
విద్యార్హతలు!
- మైనింగ్ డిగ్రీ / సివిల్ ఇంజినీరింగ్.
- GATE-2023లో కచ్చితంగా పాసై ఉండాలి.
- అభ్యర్థులు ఎం.ఎస్.సీ / ఎం.టెక్‌లో జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీతభత్యాలు!
Coal India Limited Jobs Salary : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతనం పొందుతారు.
దరఖాస్తు విధానం!
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం!
Coal India Limited Jobs Selection Process : డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు సహా GATE-2023లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు!
- జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు- రూ.1,180/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. పూర్తిగా ఉచితం.
ముఖ్యమైన తేదీలు!
Coal India Limited Jobs Important Dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 13
- దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ : 2023 అక్టోబర్ 12(సాయంత్రం 6 గంటల వరకు)
జాబ్ లొకేషన్!
Coal India Limited Job Location : మేనేమెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్!
CIL Website : నోటిఫికేషన్‌కి సంబంధించి సిలబస్ సహా తదితర పూర్తి వివరాల కోసం కోల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ https://www.coalindia.in ను వీక్షించవచ్చు.
- UPSC Engineering Jobs : ప్రభుత్వ విభాగాల్లో 167 ఇంజినీరింగ్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!
- How To Join Indian Armed Forces : త్రివిధ దళాల్లో చేరాలని ఉందా? NDA ఒక్కటే కాదు.. ఇలా కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చు!
- Indian Coast Guard Jobs : డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతతో.. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్, యాంత్రిక్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!