దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అయోధ్య దీపోత్సవం' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన సీతారాములు సహా లక్ష్మణుడు, భరతుడు పాత్రలు ధరించిన కళాకారులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. వారికి 'రాజ తిలకం' దిద్దారు. పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వియత్నాం, కెన్యా, ట్రినిడాడ్ అండ్ టుబాగో రాయబారులు సైతం పాల్గొన్నారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి పాత్రలను పోషిస్తున్న కళాకారులకు 'రాజ తిలకం' దిద్దారు.
అంతకముందు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీతారాములు సహా.. లక్ష్మణుడు, భరతుడి వేషధారులు.. యోగి ఆదిత్యనాథ్‌తో సహా హెలికాప్టర్లో అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యలో దీపోత్సవాన్ని యూపీ ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తోంది.
ఇవీ చదవండి: