CM Revanth Reddy Review on Rythu Runa mafi Scheme : ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలతో పాటు కీలక హామీలు ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలైన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు కార్యక్రమాలు చేపట్టగా తాజాగా మరో హామీ అయిన రైతు రుణమాఫీ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది.
గత ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వగా విడతల వారీగా చెల్లింపులు చేస్తూ వచ్చింది. దశలవారీగా రుణమాఫీ చేస్తుండటంపై అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల వరకు ఒకేసారి రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది.
ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి
2 lakh Rythu Runa Mafi Scheme : అధికారం చేపట్టిన మరుక్షణమే ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సమీక్షలు మొదలు పెట్టి రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండేవి బీఆఎర్ఎస్ అధికారం చేపట్టాక పదేళ్ల పరిపాలనలో ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పంట పెట్టుబడి సాయం పైసలు వెంటనే రైతుల ఖాతాల్లో వెయ్యాలని సీఎం అధికారులను ఆదేశించారు. గతంలో వరంగల్ ‘రైతు సంఘర్షణ’ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు
Crop Loan Waiver Scheme : రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు 20 వేల కోట్లు నుంచి 25 వేల కోట్లు రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆ మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సిద్దపడింది. రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇస్తుంది. దీంతో రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు రుణ విముక్తి కలగనుంది. ఉదాహరణకి రూ.25 వేల కోట్లకు బ్యాంకర్లకు ప్రభుత్వం హామీ ఇచినట్లైతే ఆ మొత్తాన్ని 50 నెలల పాటు ప్రతి నెల రూ. 500 కోట్లు వడ్డీతో కలిపి ప్రతి నెల రూ. 550 కోట్లు నుంచి రూ.600 కోట్లు చెల్లిస్తే అప్పు తీరుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై ఒకేసారి ఆర్ధిక భారం పడకపోగా ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా రుణమాఫీ చేయడంతో పాటు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటివరకు రైతులు చెల్లించే పావలా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి అవకాశం ఇవ్వనుంది.
మహాలక్ష్మి పథకాల అమలుపై ప్రజల హర్షాతిరేకాలు - జేబీఎస్లో సజ్జనార్ పరిశీలన
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం పిలుపు