ETV Bharat / bharat

సీఎం రేవంత్​కు స్వల్ప అస్వస్థత - కరోనా పరీక్ష చేయనున్న వైద్యులు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 12:24 PM IST

Updated : Dec 25, 2023, 12:39 PM IST

CM Revanth Reddy Fell Sick : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్​లోని ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయనున్నట్లు సమాచారం.

cm revanth reddy health update
revanth health issue

CM Revanth Reddy Fell Sick : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న సీఎం రేవంత్(CM Revanth) ప్రస్తుతం ఇంటిపట్టునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న రేవంత్​కు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన కేఏ పాల్‌ - ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ఆహ్వానం

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొవిడ్(Covid) న్యూ వేరియంట్ జేఎన్1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటంతో కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే ఇటీవల సీఎంతో పాటు సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

'కరోనా కొత్త వేరియంట్​తో భయం లేదు- వ్యాక్సిన్ ఎక్స్​ట్రా డోస్​ కూడా!'

Last Updated : Dec 25, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.