ETV Bharat / bharat

కేరళ సీఎం విజయన్​ రాజీనామా

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. విజయన్​ రాజీనామాను ఆమోదించిన ఆ రాష్ట్ర గవర్నర్​ ​ఆరిఫ్ మహ్మద్​ ఖాన్​.. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు మంత్రిమండలిని కొనసాగించాలని విజయన్​ను కోరారు.

pinarayi vijayan, kerala governor
కేరళ సీఎం పినరయి విజయన్​ రాజీనామా
author img

By

Published : May 3, 2021, 10:55 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్​డీఎఫ్​) రెండోసారి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తన పదవికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​కు సమర్పించారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

"అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరుణంలో.. రాష్ట్ర గవర్నర్​ను రాజ్​భవన్​లో ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కలిశారు. తన రాజీనామాను గవర్నర్​కు సమర్పించారు."

-కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం

పినరయి విజయన్ రాజీనామాను గవర్నర్ ఆరిఫ్​ ఖాన్​​ ఆమోదించారని రాజ్​భవన్​ ట్విట్టర్​ వేదికగా తెలిపింది. అయితే.. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యేవరకు పినరయి విజయన్​ను, తన మంత్రి మండలిని కొనసాగించాలని గవర్నర్​ కోరినట్లు తెలిపింది.

2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్​డీఎఫ్ 99 స్థానాల్లో గెలుపొంది రెండోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్​ 41 స్థానాలకే పరిమితమైంది. ఇక కమలంపార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది.

ఇదీ చూడండి: కేరళ అసెంబ్లీలో మామాఅల్లుళ్ల సందడి

ఇదీ చూడండి: పునరపి విజయం- చరిత్ర సృష్టించిన ఎల్​డీఎఫ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.