దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. దిల్లీలోని 72 లక్షల మంది నిరుపేదలకు.. నెలకు 10 కిలోల ఆహార పదార్థాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు లేని పేదలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ఇతర నిర్ణయాలు..
- ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబానికి నెలకు రూ.2500 పింఛను దిల్లీ ప్రభుత్వం అందించనుంది.
- మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు/సింగిల్ పేరెంట్ మరణించిన సందర్భంలో పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2500 ఇవ్వనున్నారు. వారి చదువులకు అయ్యే ఖర్చును దిల్లీ ప్రభుత్వం భరించనుంది.
ప్రకటించిన నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఇవీ చదవండి: అనాథలైన చిన్నారులకు అండగా ప్రభుత్వం: సీఎం