ETV Bharat / bharat

Ambedkar Statue : సాగరతీరాన.. అంబరమంత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేడే

CM KCR to unveil Ambedkar statue today : హక్కులసారథి, పీడితుల దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహావిష్కరణ ఘట్టానికి సమయం ఆసన్నమైంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద విగ్రహాన్ని.. బాబాసాహెబ్‌ జయంతిని పురస్కరించుకుని అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా జరగనున్న ఈ వేడుకకు అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ambdekar
ambdekar
author img

By

Published : Apr 14, 2023, 7:33 AM IST

Updated : Apr 14, 2023, 7:43 AM IST

నేడే.. ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

CM KCR to unveil Ambedkar statue : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2016 ఏప్రిల్‌ 14న బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. విగ్రహ ఆవిష్కరణ కమిటీ కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైంది. ఎస్సీ సంక్షేమశాఖ డీపీఆర్‌ రూపొందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం డిజైన్‌ అసోసియేట్స్‌ను నియమిస్తూ 2018 ఏప్రిల్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కన్సల్టెన్సీ వృత్తాకార, చతురస్రాకారస్తూపాల డిజైన్లు సిద్ధంచేయగా, సీఎం కేసీఆర్‌.. వృత్తాకార నమూనాకు ఆమోదం తెలిపారు.

Ambedkar statue unveiling today : పార్లమెంటు భవనం నమూనాలో సిద్ధం చేయాలని సూచించారు. దిల్లీలోని రాంసుతార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, మత్తురామ్‌ ఆర్ట్స్‌ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు చెందిన శిల్పుల పర్యవేక్షణలో డీపీఆర్‌ సిద్ధమైంది. ఈ మేరకు 2020 సెప్టెంబరు 16న రూ.146.5 కోట్లకు ఎస్సీ సంక్షేమ శాఖ పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్‌ 6న ఒప్పందంచేసుకుని 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని షరతు విధించగా పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వచ్చారు.

ముఖ్య అతిథిగా అంబేడ్కర్‌ మనవడు.. హుస్సేన్‌సాగర్‌ తీరంలో రూపుదిద్దుకున్న ఆ భారీవిగ్రహాన్ని మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్లమెంట్‌ ఆకారంలో 50 అడుగుల పీఠంపై ఏర్పాటుచేసిన 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లుచేసింది.

World's Largest Ambedkar statue in Hyderabad : పీఠం లోపల అంబేడ్కర్‌ జీవిత ఘట్టాలకు చెందిన ఛాయాచిత్రాలతో ప్రత్యేక ఫొటోఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ఆడియో, విజువల్‌ ఏర్పాట్లు, అంతర్గత ఇంటీరియర్‌ డిజైన్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరుకానున్న అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నిన్న సాయంత్రమే హైదరాబాద్‌ చేరుకున్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. ‘‘బీఆర్‌ అంబేడ్కర్‌ దూరదృష్టితో ఆలోచించి రాజ్యాంగ రూపకల్పన చేశారని...ఆర్టికల్‌-3 లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టమయ్యేదని చెప్పారు.

హెలికాప్టర్‌తో పూల వర్షం.. అంబేడ్కర్ విగ్రహ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యాంగ నిర్మాతస్మారకం ప్రాంగణానికి రానున్నారు. తొలుత శిలాఫలకం ఆవిష్కరించి... ఆ తర్వాత ఆడిటోరియం ప్రధాన భవనాన్ని ప్రారంభించనున్నారు. లిఫ్టు ద్వారా విగ్రహం పాదాల వద్దకు చేరుకొని అక్కడ బౌద్ధగురువుల పూజల అనంతరం విగ్రహావిష్కరణ చేస్తారు. ఆ సమయంలో హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురుస్తుంది.

కట్టుదిట్టమైన భద్రత.. ప్రధాన వేదికపై నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రసంగించనున్నారు. అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది వరకు జనం హాజరుకానున్నారు. కార్యక్రమం శాంతియుతంగా జరిగేందుకు భద్రతా ఏర్పాట్లపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 14, 2023, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.