ETV Bharat / bharat

విద్యుత్‌ కనెక్షన్లలో స్మార్ట్​గా జగన్ దోపిడీ - పనేదైనా కమిషన్‌ కొట్టేయ్ - AP Latest News

CM Jagan Fraud in Setting up Smart Meters: కొందరు 'నాకేంటి'? అని ఆశించకుండా ఏ పనీ చేయరు ముఖ్యమంత్రి జగన్‌ కూడా అదే బాపతు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనకేంటి అని ఆలోచిస్తారు. పథకమేదైనా, పనేదైనా అందులో ఎంత కమిషన్‌ కొట్టేయొచ్చు జేబు సంస్థలకు ఎలా దోచిపెటట్టొచ్చు అని తూకం వేసుకోనిదే ఆయన ఏ నిర్ణయమూ తీసుకోరు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఒప్పందంలోనూ ఇదే జరిగింది. మహారాష్ట్రతో పోలిస్తే అధిక ధరలు చెల్లిస్తూ జగన్ బంధుగణానికి చెందిన షిరిడీ సాయి సంస్థకు కోట్లు దోచిపెట్టారు.

cm_jagan_fraud
cm_jagan_fraud
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 7:16 AM IST

విద్యుత్‌ కనెక్షన్లలో స్మార్ట్​గా జగన్ దోపిడీ - పనేదైనా కమిషన్‌ కొట్టేయ్

CM Jagan Fraud in Setting up Smart Meters: మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు వాల్‌ మౌంటెడ్‌ ఎన్​ఎంసీ మీటర్‌ బాక్సులు ఏర్పాటు చేసింది. సింటెక్స్‌ కంపెనీకి చెందిన ఒక్కో బాక్సు 2,100 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. దాదాపు అవే ప్రమాణాలున్న ఒక్కో ఎన్​ఎంసీ బాక్సుకు జగన్‌ ప్రభుత్వం 4,100 రూపాయలను రాష్ట్రంలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు చెల్లిస్తోంది. అంటే మహారాష్ట్రతో పోల్చితే ఒక్కో బాక్సుకు వైసీపీ సర్కార్ 2000 రూపాయలు అధికంగా చెల్లిస్తోంది. ఈ లెక్కన మొత్తం 18 లక్షల 58 వేల కనెక్షన్లకు 371 కోట్ల 72 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సాధారణ కంపెనీలకు చెందిన ఎన్​ఎంసీ బాక్సు ధర మార్కెట్‌లో 900 రూపాయలకు మించడం లేదు.

'షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీ'పై రెండో రోజూ కొనసాగిన ఐటీ దాడులు- పలు రికార్డులు స్వాధీనం!

రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చడంతోపాటు ఐదేళ్ల నిర్వహణకు 3 డిస్కంల పరిధిలో ఒక్కో మీటర్‌కు ప్రభుత్వం 30,627 రూపాయల ధర నిర్ణయించింది. ఈ లెక్కన ఒక్కో మీటర్‌కు నెలకు 510 రూపాయలు ఖర్చు చేయబోతోంది. కానీ మహారాష్ట్రలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు అవుతున్న ఖర్చు 200 రూపాయలే. అంటే మహారాష్ట్రతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా జగన్‌ ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 18 లక్షల 58 వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు వైసీపీ ప్రభుత్వం 5 వేల 692 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఈ మొత్తంలో స్మార్ట్‌ మీటర్ల కోసం 11 వందల 15 కోట్లు వెచ్చిస్తుంటే అనుబంధ పరికరాలు, నిర్వహణ కోసం పెట్టే ఖర్చు 4 వేల 577కోట్లు స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన ధరకు మించి ఖర్చు చేయడం సాధ్యం కాదు అందుకే అనుబంధ పరికరాలు, నిర్వహణ పేరిట అందుకు 4.10 రెట్లు చెల్లించేలా అంచనాలు తయారు చేసింది. దీనికోసం షిర్డీసాయి, అదానీ సంస్థలే టెండర్లు దాఖలు చేయగా ప్రభుత్వం ముందుగా నిర్దేశించినట్లే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కే టెండరు దక్కింది.

నీళ్లు లేవంటూనే ఆ కంపెనీలకు కేటాయింపులు.. ప్రజల కన్నా వారే ముఖ్యమా..!

గుత్తేదారు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు అనుబంధ పరికరాల జాబితాను డిస్కంలు భారీగా పెంచాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఐఆర్​డీఏ మీటర్లు ఏర్పాటు చేసినప్పుడు వాటికి అనుబంధ పరికరాల కోసం డిస్కంలు చేసిన ఖర్చు 615 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఒక్కో కనెక్షన్‌కు అనుబంధ పరికరాల కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 8 వేల 441 రూపాయలు అంటే ఏకంగా 13.73 రెట్లు అధిక మొత్తాన్ని గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తోంది. మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని విద్యుత్‌రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో అనుంబంధ పరికరాలకు చేసిన ఖర్చుతో పోలిస్తే సాంకేతికత కోసం చేసే ఖర్చులనూ ప్రభుత్వం భారీగా పెంచేసింది. సర్వే, జీఐఎస్​ మ్యాపింగ్‌ కోసమే ఒక్కో కనెక్షన్‌కు 775 రూపాయల చొప్పున 18 లక్షల 58 వేల కనెక్షన్లకు 144 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో విద్యుత్‌ వినియోగం డేటాను డిస్కంల నెట్‌వర్క్‌కు అందించేలా హెడ్‌ ఎండ్‌ సిస్టం మీటర్‌డేటా మేనేజ్‌మెంట్‌ సిస్టం, మీటర్‌ డేటా అక్విజిషన్‌ సిస్టం కోసం ఒక్కో కనెక్షన్‌కు 3వేల 150 రూపాయల చొప్పున 585 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. డేటా ట్రాన్స్‌ఫర్‌ కోసం క్లౌడ్‌ సాంకేతికత వినియోగించుకుంటే తక్కువ మొత్తం ఖర్చుతో సరిపోతుందని కేంద్రం సూచించినా గుత్తేదారు సంస్థకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రతిపాదనలను ఆమోదించింది.

అంతా అనుకున్నట్లే.. పట్టణాల్లో అదానీ.. గ్రామాల్లో షిర్డిసాయి.!

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు అవసరమైన ఎన్​ఎంసీ బాక్సులు ఇతర పరికరాలు తేకుండానే, తెచ్చినట్లు లెక్కలు చూపి గుత్తేదారు సంస్థ బిల్లులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ ప్రాజెక్టు అమలు కోసం 2022-23, 2023-24లో 3వేల 436కోట్లు చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 18 లక్షల 58వేల విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఒకే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. కానీ బాక్సులు తెచ్చినట్లు లెక్కలు చూపి అనుబంధ పరికరాల కోసం వెచ్చించే మొత్తాన్ని బిల్లులు చేసుకుంటున్నట్లు సమాచారం. 3డిస్కంల పరిధిలో సుమారు 6 లక్షల ఎన్​ఎంసీ బాక్సులు సరఫరా చేసినట్లు గుత్తేదారు సంస్థ లెక్కలు చూపుతోంది. స్మార్ట్‌ మీటర్లు లేకుండా బాక్సులు తీసుకుని ఉపయోగం ఏంటి? అనేది అంతుచిక్కడంలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.