ETV Bharat / bharat

ప్రేయసిపై యువకుడు కర్కశం.. వీడియో వైరల్.. స్పందించిన సీఎం - హేమంత్ సొరెన్ బాలిక దాడి వీడియో

youth beating tribal girl: ఝార్ఖండ్​లో ఓ వ్యక్తి... తన ప్రేయసి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. దారుణంగా కొడుతూ.. కాళ్లతో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం.

youth beating tribal girl
youth beating tribal girl
author img

By

Published : May 23, 2022, 4:46 AM IST

వైరల్ వీడియో

youth beating tribal girl: ఝార్ఖండ్​లో ఓ విద్యార్థి పట్ల యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ బాలికపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాళ్లతో తన్నుతూ బాలికను పరిగెత్తించాడు. కిందపడినా వదలిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఇది ఝార్ఖం ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ వరకు చేరింది. దీనిపై స్పందించిన సీఎం.. పోలీసులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

cm hemant soren
సీఎం ట్వీట్

విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడు 16ఏళ్ల బాలుడని నిర్ధరణకు వచ్చారు. అతడిది దుమ్కా జిల్లా అని.. తొమ్మిదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని పాకూర్ జిల్లా ఎస్పీ హృదీప్ జనార్ధనన్ స్పష్టం చేశారు. యువకుడు ఆ బాలికతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోందని దుమ్కా సబ్​డివిజనల్ పోలీస్ అధికారి నూర్ ముస్తఫా అన్సారీ వివరించారు. 15 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇటీవల విస్తృతంగా వైరల్ కావడం వల్ల.. సీఎం దృష్టికి చేరిందని చెప్పారు. బాలుడు, బాలిక ఇద్దరూ గిరిజన ప్రాంతానికి చెందనవారేనని పోలీసులు వెల్లడించారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్​కు పిలిచి మాట్లాడినట్లు తెలిపారు. బాలుడు మైనర్ అయినందున.. అతడిని రిమాండ్ హోమ్​కు తరలిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.