ETV Bharat / bharat

నదిలో వెళ్తుండగా సీఎంకు ప్రమాదం.. పిల్లర్​ను ఢీకొట్టిన బోటు.. స్వల్ప గాయాలు - పట్నాలో నీతీశ్ కుమార్ పర్యటన

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పట్నాలోని గంగా ఘాట్లను పరిశీలిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పడవ.. ఓ పిల్లర్​ను ఢీకొట్టింది.

nitish kumar boat accident
బిహార్ సీఎం నీతీశ్ కుమార్
author img

By

Published : Oct 15, 2022, 4:34 PM IST

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న స్టీమర్ ప్రమాదానికి గురైంది. నీతీశ్​.. పట్నాలోని గంగా ఘాట్లను పరిశీలించేందుకు పడవలో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ పడవ.. గంగా నదిలోని జేపీ బ్రిడ్జ్ పిల్లర్​ను ఢీకొట్టింది. దీంతో నీతీశ్​కు స్వల్ప గాయాలయ్యాయి.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఛఠ్​పూజకు వేడుకలకు గంగా నదిలోని ఘాట్లను పరిశీలించేందుకు నీతీశ్ పట్నాకు వెళ్లారు. నీతీశ్ కుమార్​ సహా ఇతర అధికారులు వివిధ పడవలో ఘాట్​లను సందర్శించారు. ప్రతి ఏడాది ఛఠ్ పూజలకు ముందు గంగా ఘాట్​లను ముఖ్యమంత్రి నీతీశ్ స్వయంగా పర్యవేక్షిస్తారు.

దీపావళి పండుగ జరిగిన ఆరురోజుల తర్వాత ఛఠ్‌ పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. మహిళలు ఉపవాస దీక్షలు చేస్తారు. నీళ్లల్లో నిలబడి సూర్య నారాయణస్వామికి ప్రసాదం నివేదిస్తారు. ఆ తర్వాత జలం, క్షీరముతో అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 30న ఛఠ్ పూజలు ప్రారంభం కానున్నాయి.

ఇవీ చదవండి: ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీరీ పండిట్​ హత్య

ప్రొఫెసర్​ సాయిబాబాకు షాక్​.. హైకోర్టు తీర్పును సస్పెండ్​ చేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.