ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో తొమ్మిదోతరగతి విద్యార్థినిపై(rape victim) తన సహవిద్యార్థిని సోదరుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇదీ జరిగింది
బాధితురాలు.. గ్రామంలోని తన సహవిద్యార్థిని ఇంటికి ఆదివారం వెళ్లింది. అక్కడే నిందితుడు అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను రికార్డు చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది ఆ బాలిక. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మరో ఘటన
బరేలీ జిల్లాలో ఓ మదర్సా ఉపాధ్యాయుడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. "ఆమె నాలుగేళ్ల క్రితం మదర్సాకు వెళ్లింది. అక్కడే ఆమెతో కలిసి ఓ యువకుడు కూడా చదువుకునేవాడు. తర్వాత అతను మదర్సాలో బోధించడం మొదలు పెట్టాడు. కొంత కాలం తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితుడు పదేపదే అత్యాచారం చేశాడు. ఫలితంగా గర్భం దాల్చగా.. అబార్షన్ చేసుకోవాలి ఒత్తిడి చేశాడు. ఒకసారి నిందితుడి ఇంటికి బాధితురాలు వెళ్లగా.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేకపోతే చంపుతానని బెదిరించాడు."
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Rape: నమ్మి వెంట వెళ్లిన యువకుడిపై అత్యాచారం