12 ఏళ్ల బాలికపై ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ బరేలీలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
పని చేసుకుని ఇంటికి వస్తోన్న బాధితురాలి తల్లికి తన నివాసంలో అమ్మాయి అరుపులు వినిపించాయి. లోపలికెళ్లిచూడగా బాలికను ఓ బాలుడు అత్యాచారం చేయబోతున్నాడు. అడ్డుకోబోయిన తల్లి, బాధితురాలిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆ బాలుడు.
-కేకే వర్మ, ఎస్సై
ఈ క్రమంలో బాధితురాలు, ఆమె తల్లిని.. ఆ బాలుడి ముగ్గురు కుటుంబ సభ్యులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దారుణం: మూడేళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం