పది, పన్నెండో తరగతి ఫలితాలను శనివారం 3 గంటలకు విడుదల చేసింది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE results 2021) బోర్డు. ఈ మేరకు ఫలితాలపై ఓ ప్రకటన చేశారు బోర్డు కార్యదర్శి అరథూన్ తెలిపారు.
"10వ తరగతిలో బాలబాలికల ఉత్తీర్ణత శాతం 99.98గా ఉంది. 12వ తరగతిలో బాలికల ఉత్తీర్ణత శాతం 99.86 కాగా.. బాలుర శాతం 99.66గా నమోదైంది."
--గెర్రీ అరథూన్, సీఐఎస్సీఈ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్.
గతేడాది విధంగానే పేపర్ రీ చెకింగ్ లేదని తెలిపిన అరథూన్.. పునర్మూల్యాంకణం ఉంటుందని స్పష్టం చేశారు.
కొవిడ్ దృష్ట్యా 10,12 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించకూడదని గతంలో బోర్డు నిర్ణయించింది. అయితే.. ఇతర అసైన్మెంట్ల ఆధారంగా ఫలితాలు వెల్లడించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:CBSE: ఫీజు రీఫండ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు