కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(సీఐసీఎస్ఈ) పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. వీటిలో ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐఎస్సీ) 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 8న ప్రారంభమై జూన్ 16న ముగియనున్నాయి. ఇక ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఐసీఎస్ఈ)-10వ తరగతి పరీక్షలు మే 5 నుంచి జూన్ 7వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల అనంతరం జులై నుంచి వివిధ పాఠశాలల పరిధిలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అరథూన్ తెలిపారు. సీఐసీఎస్ఈ పరీక్షలు ప్రతీ ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలోనే నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదా పడ్డాయి.
ఇదీ చదవండి: తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు రద్దు