ETV Bharat / bharat

'శ్రీలంకలో చైనా ఉనికి.. భారత్​కు ముప్పే' - సముద్ర తీర ప్రాంతాల్లో భారత్​ భద్రతా చర్యలు

శ్రీలంకలో చైనా కార్యకలాపాల వల్ల మన దేశానికి ముప్పు కలిగే అవకాశం ఉందని భారత నౌకాదళం పేర్కొంది. చైనా చర్యలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అదే సమయంలో.. భారత సముద్రతీర ప్రాంతాల్లో ఎవరూ అలజడి సృష్టించలేరని స్పష్టం చేసింది.

indian navy
భారత నౌకాదళం
author img

By

Published : Jun 20, 2021, 8:36 AM IST

శ్రీలంకలో చైనా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు భారత్​కు ముప్పు కలిగించవచ్చని నావికాదళం పేర్కొంది. చైనా కార్యకలాపాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు ఏఎన్​ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నావికాదళ వైస్​ చీఫ్​, వైస్​ అడ్మిరల్​ జి.అశోక్​ కుమార్ తెలిపారు. భారత తీరప్రాంత సరిహద్దులను రక్షించటంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉందన్న ఆయన.. ఎవరూ కూడా ఈ మార్గాల్లో అలజడి సృష్టించలేరని పేర్కొన్నారు.

"శ్రీలంకలో చైనా చేపడుతున్న ప్రాజెక్టులు.. భారత్​కు ముప్పా? కాదా? అనేది కష్టతరమైన ప్రశ్నే. ఈ ప్రాంతానికి చెందని వారు ఇక్కడ అధిక ఆసక్తి చూపిస్తున్నారంటే.. కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి.. భారత్​కు చైనా చర్యలు ముప్పు కలిగించవచ్చు. అందుకే మనం ఈ ప్రాంతాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాలి."

-జి.అశోక్​ కుమార్​, నేవీ వైస్​ చీఫ్

శ్రీలంక తీరాల్లోకి చైనా చొరబడిందని వైస్ అడ్మిరల్ అశోక్​ కుమార్​ తెలిపారు. 26/11 ముంబయిపై దాడి తర్వాత భారత్... తీర ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిందని, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసిందని పేర్కొన్నారు. గత పదేళ్ల కంటే భారత నావికా దళం ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ఆ సబ్​మెరైన్లలో 95% దేశీయ పరికరాలే!

Submarine: భారత జలాల్లోకి కొత్త 'సొరలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.