ETV Bharat / bharat

'సరిహద్దు వివాదాన్ని సజీవంగా ఉంచాలని చైనా కుట్ర!'​ - మనోజ్​ పాండే న్యూస్​

Army Chief General On China: ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేలా బలగాలను మోహరించినట్లు ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ పాండే తెలిపారు. సరిహద్దు వివాదం పరిష్కారం కాకుండా ఉంచడమే చైనా ఉద్దేశమని పేర్కొన్నారు.

Army Chief General On China
Army Chief General On China
author img

By

Published : May 9, 2022, 9:17 PM IST

Army Chief General On China: సరిహద్దు వివాదం పరిష్కారం కాకుండా ఉంచడమే చైనా ఉద్దేశమని భారత ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ పాండే అన్నారు. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేలా బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఏప్రిల్​ 2020కి ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సరిహద్దులో ఉన్న సైనికులు దృఢంగా ఉండేలా మార్గదర్శకత్వం అందించామన్నారు.

"సరిహద్దు వివాదం ప్రాథమిక పరిష్కారం లేకుండానే మిగిలిపోయింది. చైనా ఉద్దేశం సరిహద్దు సమస్యను సజీవంగా ఉంచడమే. దౌత్య, సైనిక చర్చలతో పాంగోంగ్​ సో, గోగ్రా, గల్వాన్​లో మోహరించిన బలగాలను ఉపసంహరించుకున్నాం. మిగిలిన ప్రాంతాల్లోనూ చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం."

- మనోజ్​ పాండే, ఆర్మీ జనరల్​ చీఫ్

ఇరుదేశాల మధ్య ప్రశాంతతను నెలకొల్పడమే తమ లక్ష్యమని.. కానీ అది ఒక్కరితోనే సాధ్యం కాదన్నారు. ఇటీవలే భారత 29వ ఆర్మీ చీఫ్​గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె నుంచి బాధ్యతలు అందుకున్నారు.

ఇదీ చదవండి: పార్టీ చాలా చేసింది.. రుణం తీర్చుకునే సమయమిదే: సోనియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.