ETV Bharat / bharat

పాక్ ఉగ్ర చొరబాట్లకు చైనా 'డ్రోన్ సాయం' - డ్రోన్ల ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లు

భారత్​లోకి చొరబడాలని యత్నిస్తున్న ఉగ్రవాదులకు 'చైనా డ్రోన్లు' ఆసరాగా నిలుస్తున్నాయి. వీటిని ఉపయోగించి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను ముష్కరమూకలు సరఫరా చేస్తున్నాయి. వీటిని భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో డ్రోన్ల ఘటనలు బాగా పెరిగిపోయాయి.

China-made drones new terror toys on LoC, IB
చైనా డ్రోన్లు
author img

By

Published : Nov 30, 2020, 6:01 PM IST

చైనా డ్రోన్ల వల్ల భద్రతా దళాలకు ముప్పు పరిణమించింది. ఈ వాణిజ్య డ్రోన్లు ఉగ్రవాదులకు ఆసరాగా నిలుస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కర మూకలు వీటిని ఉపయోగించుకొని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ గుండా ఆయుధాలు, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాయి.

శీతాకాలంలో జమ్ము కశ్మీర్​లోని సరిహద్దు వెంట డ్రోన్ల ద్వారా ఆయుధాల అక్రమ రవాణా చేయడం అంత సులభం కాదు. శీతల గాలులు, పలు ప్రాంతాల్లో 40-50 అడుగుల మేర మంచు పేరుకుపోవడం వల్ల డ్రోన్ల ద్వారా వీటి రవాణా ఈ కాలంలో నిలిచిపోతుంది. కానీ, చైనా తయారు చేసిన డ్రోన్ల ద్వారా చలికాలంలోనూ ఎలాంటి అడ్డు లేకుండా వీరి నిర్వాకం కొనసాగుతోంది. మంచు కురిసినా వీరి పని ఆగకుండా ముందుకు సాగుతోంది.

ఇదీ చదవండి: డ్రోన్​లతో పాక్ కుట్రలు- భారత సైన్యం అప్రమత్తం

కశ్మీర్​లో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల వల్ల ముష్కర మూకలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరత ఏర్పడింది. అయితే, ఉగ్రవాదుల చొరబాట్లు, లాజిస్టిక్ అవసరాల కోసం డ్రోన్ల ద్వారా ఆయుధాలను, మాదకద్రవ్యాలను సరిహద్దు దాటించడం ఇటీవల తరచుగా జరుగుతోంది.

ఇదీ చదవండి: పాక్​ డ్రోన్ కలకలం- నేలకూల్చిన భారత సైన్యం

హెక్సాకాఫ్టర్​గా పిలిచే ఈ డ్రోన్లు మార్కెట్​లో సులభంగా లభిస్తాయి. ఒకేసారి పలు ఆయుధాలను వీటి ద్వారా మోసుకెళ్లవచ్చు. కేజీల చొప్పున మాదకద్రవ్యాలను సరిహద్దు దాటించవచ్చు. దీంతోపాటు భారత బలగాలను గుర్తించేందుకు, రక్షణ వ్యవస్థలను పసిగట్టేందుకూ వీటిని వినియోగిస్తున్నారు ఉగ్రవాదులు. భారత్​లోకి ప్రవేశించేందుకు ముష్కరులకు ఈ సమాచారం కీలకంగా మారుతోంది. అందువల్ల వీటిని ఉపయోగించేందుకు ఉగ్రవాదులు మొగ్గుచూపుతున్నారు.

కుట్రలు భగ్నం

అయితే, భద్రతా దళాలు ఎప్పటికప్పుడు పాక్ డ్రోన్లపై నిఘా వేసి ఉంచుతున్నాయి. ఈటీవీ భారత్​కు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు... చైనాలో తయారైన రెండు రైఫిళ్లు, మూడు ఎం14/ఎం16 రైఫిళ్లు, 46 ఏకే సిరీస్ ఆయుధాలు, 58 పిస్తోళ్లను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నప్పుడు, వారిని హతమార్చినప్పుడు రికవరీ చేసుకున్న ఆయుధాలకు ఇవి అదనం.

ఇదీ చదవండి: మారని పాక్ వక్రబుద్ధి- డ్రోన్లతో ఆయుధాలు చేరవేత

"ఈ సంవత్సరం ఎనిమిది చొరబాటు ప్రయత్నాలను అడ్డుకున్నాం. ఎల్​ఓసీ వెంట 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఈ ఏడాది అంతర్జాతీయ సరిహద్దు వద్ద 80 కేజీలు, ఎల్​ఓసీ వద్ద 10 కేజీల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం. పాకిస్థాన్​లో ఉగ్రవాద శిక్షణ క్యాంపులు పెరుగుతున్నాయి. బాలాకోట్ దాడుల దర్వాత పాకిస్థాన్ రహస్యంగా ఈ స్థావరాలను నడిపిస్తోంది."

-అధికార వర్గాలు

బలగాలు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలలో బ్రౌన్ షుగర్, హెరాయిన్ అధికంగా ఉంటోంది. ప్రపంచంలో 84 శాతం నల్లమందు ఉత్పత్తి అవుతున్న అఫ్గానిస్థాన్ నుంచే ఇది అత్యధికంగా వస్తోంది.

(రచయిత-సంజీవ్ బారువా)

ఇదీ చదవండి: కశ్మీర్​లో పాక్​ ఆయుధాలు.. ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.