ETV Bharat / bharat

చైనా కుట్ర- డోక్లామ్​ సమీపంలో రహదారి నిర్మాణం - చైనా సరిహద్దు కుట్రలు

చైనా బరితెగింపు రోజురోజుకూ పెరుగుతోంది. సరిహద్దు వివాదంపై భారత్‌తో ఓ వైపు చర్చలు సాగిస్తూనే.. మరోవైపు దొంగచాటుగా దుష్టప్రయత్నాలను కొనసాగిస్తోంది. వివాదాస్పద డోక్లామ్ పీఠభూమికి చేరువలో భూటాన్‌ భూభాగంలోకి రెండు కిలోమీటర్లు చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని నిర్మించింది. అంతేకాకుండా.. ఆ ప్రాంతంలో రోడ్డును వేస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైంది. దీనిద్వారా కీలకమైన భారత భూభాగంపై నిఘా పెట్టాలని భావిస్తోన్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి అధునాతన రాడార్లను సైతం ఏర్పాటు చేస్తోంది.

CHINA CONTINUES ITS PERVERSION: UNDERTOOK ROAD CONSTRUCTION AT THE DOKLAM PLATEAU
చైనా కుట్ర- డోక్లామ్​ సమీపంలో రహదారి నిర్మాణం
author img

By

Published : Nov 23, 2020, 6:15 AM IST

చైనా.. సరిహద్దులో మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. వివాదాస్పద డోక్లామ్ పీఠభూమికి సమీపంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. 2017లో జొంషైరి పర్వత పంక్తి వద్దకు రోడ్డు వేసేందుకు ఆ దేశం ప్రయత్నించగా.. దానిని విజయవంతంగా నిలువరించింది భారత సైన్యం. ఈ తరుణంలో భారత్, చైనా దళాల మధ్య దాదాపు రెండున్నర నెలలు ప్రతిష్ఠంభన ఏర్పడింది.

ఉపగ్రహ ఛాయాచిత్రాలతో బహిర్గతం

అయితే.. మూడేళ్ల తర్వాత మరోసారి దుష్టప్రయత్నానికి తెరతీసింది చైనా. అందులోభాగంగా మరో మార్గంలో రహదారి నిర్మాణం ప్రారంభించింది. టోర్సా నది ఒడ్డున మరో మార్గంలో రోడ్డువేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలలో వెల్లడైంది. ఈ రహదారి ఏకంగా 9 కిలోమీటర్ల మేర భూటాన్‌లోకి వెళ్లిందని ఆ దృశ్యాల ద్వారా తేలింది. అంతేకాకుండా.. టోర్సా నదీలోయ ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. డోక్లామ్ ప్రాంతానికి సమీపంలో సైనిక గోదాములు వెలిసినట్లూ నిరూపితమవుతోంది.

ప్రత్యామ్నాయ మార్గం కోసం..

చైనా, భూటాన్ సరిహద్దుల నుంచి మొదలైన రహదారి దక్షిణదిశగా పయనిస్తోంది. ఇది డోక్లామ్ ప్రతిష్ఠంభన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జొంషైరి పర్వత పంక్తిని చేరుకోవడానికి.. చైనాకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. జొంషైరిపై పాగావేస్తే ఈశాన్య భారతదేశ ప్రాంతాన్ని మిగిలిన దేశంతో సంధానించే కీలక భూభాగంపై నిరంతరం నిఘా పెట్టే సామర్థ్యం ఆ దేశ సైన్యానికి లభిస్తుంది.

ఇదీ చదవండి: చైనా వక్ర బుద్ధి: ఇటు చర్చలు- అటు కుట్రలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.