ETV Bharat / bharat

అండమాన్​పై చైనా బెలూన్లు! అమెరికా కంటే ముందే భారత్​పై నిఘా.. రాడార్​కు చిక్కకుండా..

author img

By

Published : Feb 25, 2023, 3:23 PM IST

భారత్‌కు రక్షణపరంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంపై ఏడాది క్రితం చైనా నిఘా బెలూన్‌ సంచరించిందా? అప్పట్లో నిఘా విభాగం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదా? చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన తర్వాత భారత్‌ అప్రమత్తమైందా? డ్రాగన్‌ నిఘా బెలూన్లను మళ్లీ ప్రయోగిస్తే వాటిని కూల్చేసేందుకు ప్రణాళిక రచించిందా? అన్న ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తుంది. అమెరికా కంటే ముందే భారత్‌లో చైనా నిఘా బెలూన్‌ సంచరించిందన్న వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

china-balloon-in-india
చైనా బెలూన్

అమెరికాలో చైనా నిఘా బెలూన్‌ సంచారం... దానిని అగ్రరాజ్యం కూల్చివేయడం వంటి ఘటనలు ఇటీవల సంచలనం సృష్టించాయి. ఈ బెలూన్లు వాతావరణ అధ్యయనానికి సంబంధించినవని చైనా ప్రకటించినా.. ఇవి నిఘా బెలూన్లే అని వాటిపై తమకు ఆధారాలు లభించాయని అమెరికా స్పష్టం చేసింది. అయితే, అమెరికా కంటే ముందే భారత్‌లో చైనా నిఘా బెలూన్లు సంచరించాయని ఓ నివేదిక వెల్లడించింది. బంగాళాఖాతంలో భారత్‌ క్షిపణి పరీక్షలు చేసే ద్వీపాలకు చాలా దగ్గరలో ఈ బెలూన్లు సంచరించాయని తెలిపింది. చైనా సహా ఉత్తర ఆసియా దేశాలకు ఇంధనం, ఇతర వస్తువుల సరఫరా చేసే కీలకమైన మలక్కా జలసంధికి సమీపంలో చైనా నిఘా బెలూన్లు సంచరించాయని వెల్లడించాయి.

బెలూన్‌లు సంచరించే సమయంలో అండమాన్, నికోబార్ దీవుల్లోని వందలాది మంది ప్రజలు బయటికి వచ్చి.. వాటిని ఫోన్‌లలో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ కూడా చేశారు. అయినా దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. భారత్‌లో కనిపించిన వస్తువును రాడార్ వ్యవస్థలు గుర్తించలేదని పలువురు అధికారులు తెలిపారు. దానిని గుర్తించి చర్యలు తీసుకునే లోపే అది సముద్రంలో నైరుతి దిశకు వెళ్లిపోయిందని వివరించారు.

చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన తర్వాత భారత్‌లోని ఈ వీడియోలపై రక్షణ శాఖ అప్రమత్తమైంది. చైనా ప్రయోగించింది నిఘా బెలూనే అని అమెరికా ఆరోపించిన తరువాత వీటిని ఎదుర్కొనే ప్రణాళికను రక్షణ శాఖ సిద్ధం చేయడంపై దృష్టిసారించింది. నిఘా బెలూన్లను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచడం సహా భవిష్యత్తులో మరింత వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. చైనీస్ నిఘా బెలూన్‌ను కూల్చేందుకు అమెరికా ఖరీదైన Aim-9X క్షిపణిని ప్రయోగించగా.. భారత్‌ మాత్రం వాటిని కూల్చేందుకు మరో మార్గాన్ని వెతుకుతోంది. రవాణా విమానాలకు అనుసంధానించిన ఫైటర్ జెట్‌లు.. భారీ మెషిన్ గన్‌లను ఉపయోగించి నిఘా బెలూన్‌లను కూల్చాలని ప్రణాళికలు రచిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.