కరోనా సంక్షోభం కారణంగా చిన్నారుల్లో మానసిక ఆందోళన పెరిగిందని ఓ తాజా నివేదికలో తేలింది. ప్రతి 4 మంది చిన్నారుల్లో ముగ్గురు ఈ పరిస్థితిని ఎదుర్కుంటున్నారని 'సేవ్ చిల్డ్రన్' స్వచ్ఛంద సేవా సంస్థ నివేదించింది. ఈ మేరకు 'ఎ జనరేషన్ ఎట్ స్టేక్' పేరుతో ఓ నివేదికను కూడా విడుదల చేసింది.
11 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో...1,598 మంది తల్లితండ్రులను, 989 చిన్నారులను(11-17 మధ్య వయసు వారు) పరిశీలించగా చిన్నారుల్లో మానసిక క్షోభ పెరిగనట్లు వెల్లడైంది. చాలా మంది పిల్లలు పాఠశాలలకు తిరిగి వెళ్లడం గురించే ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
నివేదికలో తెలిసిన మరిన్ని అంశాలు....
- కరోనా సమయంలో సొంతింట్లో పిల్లలపై భౌతిక వేధింపులు కూడా పెరిగాయి. ఇది సాధారణ పిల్లల్లో 11 శాతంగా, వలసవాదుల పిల్లల్లో 17 శాతంగా ఉంది.
- ప్రతి పది మందిలో ఒక విద్యార్థి... పాఠశాలలు ప్రారంభమైనా తిరిగి స్కూల్కు వెళ్లడంపై సందేహం వ్యక్తం చేశారు.
- పాఠశాలలు మూసివేసినప్పటినుంచి దాదాపు సగం మంది పిల్లలు తమ ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా ఉన్నారు.
- వలసదారుల పిల్లల్లో 85 శాతం మంది పిల్లలు ఉపాధి కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉపాధి కోల్పోయిన వారు 29 శాతంగా ఉన్నారు.
ఇదీ చదవండి:'నివర్' తుపాను బాధితులకు ప్రధాని సాయం