ETV Bharat / bharat

అతీతశక్తులంటూ పిల్లలను దేవుళ్లుగా ప్రకటన.. పోలీసుల ఎంట్రీతో..!

children declared as gods: కేరళలోని ఓ జోతిష్కుడు చేసిన పనితో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. పిల్లలను దేవుళ్లుగా ప్రకటించి వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేస్తున్నాడు. అంతేగాకుండా ఇలా దేవుళ్లుగా పిల్లలను ప్రకటించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు.

Children declared as gods
పిల్లలకు దేవుడి ఆవతారం
author img

By

Published : Feb 21, 2022, 8:04 PM IST

children declared as gods: కేరళ వయానాడ్​లో గిరిజనులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఓ జ్యోతిష్యుడిపై బాలల హక్కుల సంఘం, పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పలువురు చిన్నారులను దేవుళ్లని చెప్తూ స్థానికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క చిన్నారికి రూ.15,000 నుంచి రూ. 25,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. అయితే.. ఆ పిల్లలను దేవుళ్లుగా ప్రకటించిన తర్వాత వారిని బయటకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. దీంతో వారి చదువులు ఆగిపోతున్నాయి.

10వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. పాఠశాలకు రాకపోవడంపై అధికారులు ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఇలా మూఢనమ్మకాల కారణంగా ఒక్క తిరునెల్లి పంచాయతీ పరిధిలో దాదాపు 25 మంది చిన్నారుల చదువులు నిలిచిపోయినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఆ పదో తరగతి బాలికకు విశేష శక్తులు ఉన్నాయని జోతిష్యుడు స్థానికంగా ఉండే గిరిజనులను నమ్మించినట్లు పేర్కొన్నారు.

ఇలా అతీత శక్తులు ఉన్న పిల్లలను దేవతగా ప్రకటించాలని జోతిష్యుడు గిరిజనులకు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కారణంగా ఆ అమ్మాయిని బయటకు వెళ్లకుండా చేశారని తెలిపారు. ఇలాంటి పిల్లలను పూజారులుగా ఉంచేందుకు కొన్ని ప్రాంతాల్లో గుళ్లు కూడా కట్టించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించడంతో పాటు బడి మానేసిన పిల్లల వివరాలను కూడా సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు 'ఈవీఎం' ట్యాంపరింగ్​ భయం.. కార్యకర్తలతో కాపలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.