ETV Bharat / bharat

ఐస్​క్రీమ్​ బాల్​ బాంబు పేలి బాలుడికి గాయాలు - కేరళ వార్తలు తాజా

ఐస్​క్రీమ్​ బాల్​ పేలిన ఘటనలో ఓ బాలుడు గాయపడ్డాడు. బంతి అనుకుని పేలుడు పదార్థాలు ఉన్న ఈ ఐస్​క్రీమ్​ బాల్​తో ఆడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ice cream ball
ఐస్​క్రీమ్​ బాల్​ బాంబు పేలి బాలుడికి గాయాలు
author img

By

Published : Nov 23, 2021, 4:44 AM IST

ఐస్​క్రీమ్​ బాల్​ పేలి ఓ 12 ఏళ్ల బాలుడు గాయపడిన ఘటన కేరళలోని కన్నుర్​ జిల్లాలో చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలు ఉన్న ఆ ఐస్​క్రీమ్​ బాల్​తో బాలుడు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో చుట్టుపక్కల వారు ఎవరూ గాయపడలేదని తెలిపారు. గాయపడిన బాలుడు నారివయల్​కు చెందిన శ్రీవర్ధన్​గా అధికారులు గుర్తించారు.

బంతి అనుకుని..

క్రికెట్​ ఆడుతుండగా ఆ బంతి సమీపాన పడిందని.. అక్కడే ఈ ఐస్​క్రీమ్​ బాల్స్​ బాలుడికి దొరికాయని పోలీసులు వెల్లడించారు. బంతి అనుకుని దీనిని విసరగానే పేలుడు సంభవించిందని తెలిపారు. ఘటనాస్థలంలో ఇటువంటి మరో రెండిటిని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పేర్కొన్న పోలీసులు.. ఆ ఐస్​క్రీమ్​ బంతుల్లోని పదార్థాల వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు.

ice cream ball
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

ఈ ఏడాది కన్నూర్​ జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. మే నెలలో కూడా ఇటువంటి పేలుడే సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.

ఇదీ చూడండి : స్కూల్ బస్సు మిస్​ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.