ETV Bharat / bharat

బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత, 9 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసినా

Child Fell Into Borewell in Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో బోరుబావిలో చిక్కుకున్న నాలుగేళ్ల చిన్నారి మరణించింది. 25 అడుగులో లోతైన బోరుబావిలో పడిపోయిన చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 7:39 AM IST

Updated : Dec 6, 2023, 10:12 AM IST

బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి

Child Fell Into Borewell in Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మరణించింది. బోరుబావి నుంచి బయటకు తీసిన తర్వాత ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. 25 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారిని బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. సుమారు 9 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్​ చిన్నారిని బయటకు తీసిన ప్రయోజనం లేకుండా పోయింది.

ఇదీ జరిగింది
రాజ్‌గఢ్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి మహీ ఆడుకుంటూ వెళ్లి పొలంలో ఉన్న 25 అడుగుల బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో బోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్లియా రసోడా గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ క్రమంలో ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్‌గఢ్ ఎస్పీ ధరమ్‌రాజ్ మీనా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాలికను రక్షించేందుకు జేసీబీ, ఇతర పరికరాలను రప్పించారు. ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని బోరుబావి లోపల చిక్కుకున్న చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశారు. దాదాపు 9 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్​ చేసిన అధికారులు, బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయటకు తీశారు. అనంతరం వెంటనే భోపాల్​లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది.

సీఎం ట్వీట్​
అంతుకుముందు చిన్నారి బోరుబావిలో పడిపోవడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని అధికారులను ఆదేశించారు. 'ఎస్​డీఆర్​ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం బాలికను సురక్షితంగా బోర్​వెల్​ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ఏ అవకాశాన్ని వదులుకోము' అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

  • राजगढ़ जिले के पिपलिया रसोड़ा गांव में मासूम बच्ची के बोरवेल में गिरने का समाचार प्राप्त हुआ है।

    एसडीआरएफ, एनडीआरएफ और जिला प्रशासन की टीम बच्ची को सकुशल बाहर निकालने के लिए प्रयासरत है। मैं भी स्थानीय प्रशासन के निरंतर संपर्क में हूँ।

    बच्ची को सकुशल बाहर निकालने में हम कोई कसर…

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chhattisgarh Borewell Operation : కొన్నాళ్ల క్రితం బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహును దాదాపు 104 గంటల శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్​లో ఛత్తీస్​గఢ్​లోని బిలాస్‌పుర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బోరుబావి నుంచి బాలుడు బయటకు.. NDRF ఆపరేషన్​ సక్సెస్..​ హుటాహుటిన ఆస్పత్రికి!

80 గంటలుగా బోరుబావిలోనే బాలుడు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

Last Updated : Dec 6, 2023, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.