ETV Bharat / bharat

వేడినీటి టబ్​​లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి - rajasthan girl fell in hot water tub

Child Fell in Tub: పిల్లలతో ఆడుకుంటూ ఏడాదిన్నర చిన్నారి వేడినీటితో ఉన్న బాత్​టబ్​లో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​లో జరిగింది.

Child Fell in Tub
చిన్నారి మృతి
author img

By

Published : Feb 26, 2022, 8:06 PM IST

Child Fell in Tub: రాజస్థాన్​లోని భరత్​పుర్​లో హృదయవిదారక సంఘటన జరిగింది. ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ వెళ్లి వేడినీటితో ఉన్న బాత్​టబ్​లో పడి ప్రాణాలు కోల్పోయింది. బయానా ప్రాంతంలోని రేవాద్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

బంజారిపురాకు చెందిన పూజా రాజ్​పుత్​- కుల్​దీప్ రాజ్​పుత్​ల కుమార్తె దృష్టి రాజ్‌పుత్​. పుట్టింటివారిని చూసివెళ్లడానికి పూజ తన బిడ్డతో కలిసి రేవాద్​పురా వచ్చింది. అమ్మమ్మ ఊర్లో శుక్రవారం ఆరుబయట పిల్లలతో కలిసి ఆడుకుంటూ వెళ్లి వేడినీటితో ఉన్న బాత్​టబ్​లో పడిపోయింది. పిల్లల అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. దృష్టిని బయటికి తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి.

ఇదీ చదవండి: పట్టాలపై పడిపోయిన వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు.. తర్వాత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.