తిరుగుబాటు బృందాల నిర్మూలన దిశగా త్రిపుర పోలీసులు కీలక విజయం సాధించారు. నిషేధిత తిరుగుబాటు దళం.. 'నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(పీడీ)' చీఫ్ పరిమాళ్ దెబ్బర్మ అరెస్టయ్యాడు. త్రిపుర పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పరిమాళ్తో పాటు అతని అనుచరులను మిజోరం పోలీసులు అరెస్టు చేశారు.
ఐజ్వాల్‌లోని స్థానిక కోర్టులో పరిమాళ్ను ప్రవేశపెట్టనున్నట్లు త్రిపుర డీజీపీ వీఎస్ యాదవ్ వెల్లడించారు. అతన్ని త్రిపుర తీసుకెళ్లేందుకు అవసరమయ్యే 'ట్రాన్సిట్ రిమాండ్' తీసుకోనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 6న జరగనున్న 'త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్' ఎన్నికలపై పరిమాళ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు యాదవ్ పేర్కొన్నారు. ఓ జాతీయ పార్టీ నేతలు సైతం వీరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించామని చెప్పారు.
2014లో పోలీసులకు లొంగిపోయాడు పరిమాళ్. 2017లో పశ్చిమ త్రిపురలో ఓ వ్యక్తిని హత్య చేసి బంగ్లాదేశ్‌కు పారిపోయాడు. తర్వాత సొంతంగా ఓ తిరుగుబాటు బృందాన్ని తయారు చేసుకున్నాడు. దీనికి ఎఎల్ఎఫ్టీ(పరిమాళ్ దెబ్బర్మ)గా పేరు పెట్టుకున్నాడు. ఈ తిరుగుబాటు దళంపై ఎనిమిది కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి: సువేందు ఆస్తుల విలువ రూ. 80 లక్షలు