దేశ రక్షణ కోసం ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు భారత సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సరిహద్దుల రక్షణలో సైనికులు వెనుకడుగు వేయబోరని స్పష్టం చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలను సందర్శించారు సీడీఎస్ రావత్. సరిహద్దు భద్రతకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ, ఐటీబీపీ, ఎస్ఎఫ్ఎఫ్ దళాలతో మాట్లాడారు. సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారంటూ వారికి కితాబిచ్చారు.
ఇదీ చదవండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి