ETV Bharat / bharat

'ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్.. 25 రోజులుగా ఇబ్బంది పడుతున్నా'

Chief Justice N V Ramana: కరోనా వైరస్​ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్​ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. ఒమిక్రాన్​ నుంచి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు.

Chief Justice N V Ramana
జస్టిస్ ఎన్​వీ రమణ
author img

By

Published : Feb 23, 2022, 3:10 PM IST

Chief Justice N V Ramana: కరోనా ఒమిక్రాన్​ వేరియంట్​ను సైలెంట్​ కిల్లర్​గా అభివర్ణించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ. ఆ వైరస్ సోకినవారు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు.

పూర్తిస్థాయిలో భౌతిక విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్​ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోరగా.. ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రమణ. ఒక్కరోజులోనే 15వేల కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. వెంటనే స్పందించిన వికాస్.. "అది ఒమిక్రాన్. తీవ్రత స్వల్పమే" అని అన్నారు.

"అది(ఒమిక్రాన్​) సైలెంట్ కిల్లర్. కరోనా ఫస్ట్ వేవ్​లో నేను నాలుగు రోజుల్లోనే కోలుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం 25 రోజులు అవుతున్నా నేను ఇబ్బంది పడుతూనే ఉన్నా"

- జస్టిస్ ఎన్​వీ రమణ, సీజేఐ

"మీరు ఈ విషయంలో దురదృష్టవంతులు. కానీ.. ప్రజలు కోలుకుంటున్నారు" అని చెప్పారు వికాస్ సింగ్. "సరే చూద్దాం" అని బదులిచ్చారు సీజేఐ.

ఇదీ చూడండి: 10,12 తరగతుల బోర్డ్​ పరీక్షలపై సుప్రీం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.