ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ)లో శ్రీలంకకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. తమిళనాడులో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-భాజపా కూటమికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
"యూఎన్హెచ్ఆర్సీలో శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉంది. ఇది తమిళ ప్రజలకు చేసిన మోసం. తమిళ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఏఐఏడీఎంకే-భాజపా కూటమికి తగిన శిక్ష విధించాలి" అని వరుస ట్వీట్లు చేశారు చిదంబరం.
ఆ ఓటింగ్‌లో భారత ప్రతినిధులను దూరంగా ఉండాలని బలవంతం చేసినట్లయితే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి.
ఇదీ చూడండి: యూఎన్హెచ్ఆర్సీలో లంకకు వ్యతిరేకంగా తీర్మానం