ETV Bharat / bharat

పట్టువదలని విక్రమార్కుడు.. న్యాయం కోసం 36 ఏళ్లుగా ఒంటరి పోరాటం!

author img

By

Published : Nov 28, 2022, 8:18 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఓ వృద్ధుడు 36 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆయనతో పాటు 19 మంది పోరాడగా.. వారిలో 17మంది చనిపోయారు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. అసలేం జరిగిందంటే..

Chhattisgarh's retired headmasters fighting for grade pay scale since 36 years
రిటైర్డ్ హెడ్​మాస్టర్ అభయ్ రాం యాదూ

36 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ వృద్ధుడు. తనకు ఇవ్వాల్సిన గ్రేడ్ పే స్కేలు బకాయిలను రాష్ట్ర విద్యాశాఖ చెల్లించట్లేదని చెపుతున్నారు. పదవీ విరమణ తర్వాత రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టతరంగా మారిందన్నారు ఛత్తీస్​గఢ్​కు చెందిన రిటైర్డ్ హెడ్​మాస్టర్​.

ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​లోని ఓ​ ప్రైమరీ పాఠశాలలో అభయ్ రాం యాదూ అనే వ్యక్తి హెడ్​మాస్టారుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయనకు రావాల్సిన గ్రేడ్ పే స్కేలు బకాయిలను రాష్ట్ర విద్యాశాఖ చెల్లించట్లేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. 36 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. 1986 జనవరి 1 నుంచి నాలుగో పే స్కేల్ అమలులోకి వచ్చింది. అయితే అప్పట్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​లు కలిసి ఉండేవి. ఈ సెంట్రల్​ పే స్కేల్ ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగులకు రూ.1,640 నుంచి 2,900 వరకు చెల్లించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితుడు రిటైర్డ్ హెడ్​మాస్టర్ అభయ్ రాం యాదూ మాట్లాడుతూ.. "రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ గ్రేడ్ పే స్కేలు ప్రకారం వేతనాలు అందజేశారు. కానీ హెడ్​మాస్టర్లకు మాత్రం నాలుగో పే స్కేలు ఆధారంగా వేతనాలు చెల్లించలేదు. గ్రేడ్ పే రాకపోవడం వల్ల 19 మంది హెడ్ మాస్టర్లమంతా కలిసి మా హక్కుల కోసం పోరాడాలనుకున్నాం. దీనిలో భాగంగా 1995 సంవత్సరంలో జబల్​పుర్ హైకోర్టులో పిటిషన్ వేశాం. ఈ కేసు చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్​గఢ్ రాష్ట్రం విడిపోయింది. దీంతో మా కేసును బిలాస్‌పుర్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు కోసం 15 సంవత్సరాలు పోరాడిన తర్వాత 2010 ఫిబ్రవరి 15న హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2012 మార్చిలో హైకోర్టు ఆదేశాల మేరకు మాకు నెలలోపు గ్రేడ్ పే చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ. అయితే ఇప్పటికి పది సంవత్సరాలు గడుస్తున్నా మాకు న్యాయం జరగట్లేదు. 19 మంది ఈ కేసు కోసం పోరాడగా.. ఇప్పటికి 17 మంది మరణించారు. అయితే ఇప్పుడు బతికున్న ఇద్దరికి కూడా గ్రేడ్ పే స్కేలు చెల్లించట్లేదని" ఆయన అన్నారు.

ఈ విషయం గురించి దివంగత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్‌గుళం పాండే కుమారుడు రామవతార్ పాండే మాట్లాడుతూ.. "నా తండ్రి బీటీఐ హెడ్​మాస్టర్. ఆయన 1960 మే 1 నుంచి 1990 మార్చి 31 వరకు సేవలు అందించారు. అయితే నా తండ్రికి పే స్కేలు ఇవ్వలేదు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు బకాయిలతో పాటు గ్రేడ్ పే స్కేలు అందించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ బంజారా ఈ ఆదేశాలను ధిక్కరించి.. మాకు రావాల్సిన డబ్బులు మొత్తం తినేశారని" ఆయన అన్నారు.

న్యాయం కోసం పోరాడుతున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.