7 feet Brinjal plant: ఛత్తీస్గఢ్ సిల్ఫిలీ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎత్తైన వంకాయ పంటను పండించాడు. ఇజ్రాయెల్ సాంకేతికతతో ఈ ఘనత సాధించాడు.
వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలో అద్భుతాలు చేస్తున్న దినేశ్ రాయ్.. తన సొంతూరిలో కాయగూరల పంటలను సాగు చేస్తున్నాడు. కొత్త కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టి మంచి దిగుబడి రాబట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీతో వంకాయ పంటను వేశాడు. ఈ మొక్కలు ఏకంగా 7 నుంచి 8 అడుగుల పొడవు పెరిగాయి. దీన్ని చూసి దినేశ్ సంబరపడిపోతున్నాడు. ఈ మొక్కల వయసు ఏడాదిన్నర మాత్రమేనని తెలుస్తోంది. ఒక్కో మొక్కకు సంవత్సరం కాలంలో వంద కిలోల వంకాయలు కాశాయి.
tall Brinjal plant
2016 నుంచి భారత్లో ఈ ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. ఇందులో భాగంగా హైబ్రిడ్ వంకాయ మొక్క కాండంలోకి అటవీ వంకాయ వేర్లను ప్రవేశపెడతారు. సరైన ఎరువులు, ఔషధాలు అందిస్తారు. డ్రిప్ పరిజ్ఞానంతో రోజూ నీరు సరఫరా చేస్తారు. సరిగ్గా సంరక్షిస్తే ఈ మొక్కలకు ఏటా క్వింటాల్ వంకాయలు కాస్తాయి.
దినేశ్ రాయ్ 4.5 ఎకరాల్లో వంకాయ సాగు చేస్తున్నాడు. భారీగా లాభాలను గడిస్తున్నాడు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ స్థానికంగా యువతకు స్ఫూర్తిగా మారాడు.
ఇదీ చదవండి: చీర కోసం మహిళ దుస్సాహసం.. కుమారుడ్ని 9వ అంతస్తు నుంచి వేలాడదీసి..