లఖింపుర్ ఘటనలో (Lakhimpur Kheri Incident) ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఘర్షణల్లో మృతిచెందిన నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు కుటుంబానికి రూ. 50 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించాయి.
'జలియన్‌వాలా బాగ్ ఘటన గుర్తుకొచ్చింది'
లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసాకాండ (Lakhimpur Kheri Incident) తనకు జలియన్‌వాలా బాగ్ ఘటనను గుర్తుకు తెచ్చిందన్నారు పంజాబ్ సీఎం చన్నీ. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు.
లఖింపుర్ ఘటన..
యూపీలోని లఖింపుర్ ఖేరీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, యూపీ ఉపముఖ్యమంత్రి కాన్వాయ్‌లను అడ్డుకున్న రైతులపై వాహనాలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో మరో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు భాజపా కార్యకర్తలు, కేంద్ర సహాయక మంత్రి కారు డ్రైవర్, ఓ జర్నలిస్టు మృతిచెందారు.
ఇదీ చూడండి : 'లఖింపుర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి'