ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మూడ్రోజుల క్రితం మురళి అనే ఎస్సైని అపహరించిన మావోయిస్టులు అతన్ని దారుణంగా చంపేశారు. గంగలూర్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు మురళి.
ఎస్‌ఐ మృతదేహాన్ని పుల్సుమ్‌పారా వద్ద పడేసిన మావోయిస్టులు.. మృతదేహం వద్ద బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ వదిలి వెళ్లారు.
పట్టాల పేల్చివేత..
ఛత్తీస్‌గఢ్‌లోని మరో ప్రాంతంలో.. మావోలు రైలు పట్టాలను పేల్చేశారు. దీంతో భన్సీ-బచేలి ప్యాసింజర్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు.
"భన్సీ-భచేలి మధ్య ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనకు మావోయిస్టులే కారణం. ప్రయాణికులందరినీ జవాన్లు రక్షించారు. వారంతా సురక్షితంగా ఉన్నారు."
-అభిషేక్ పల్లవ్, దంతెవాడ ఎస్పీ
ఇవీ చదవండి: నక్సల్స్ దుశ్చర్య- 12 వాహనాలకు నిప్పు