ETV Bharat / bharat

రాహుల్​తో భూపేశ్ భేటీ.. సీఎం మార్పు అనివార్యమా? - ఛత్తీస్​గఢ్​లో రాజకీయ సంక్షోభం

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో భేటీ అయ్యారు ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ భఘేల్​. సీఎం పదవి నుంచి ఆయన తప్పుకోనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే భేటీ అనంతరం ఈ వ్యవహారంపై మీడియా వద్ద భఘేల్​ సరిగ్గా స్పందించలేదు.

Chhattisgarh CM Bhupesh Baghel meets Rahul Gandhi
భూపేశ్ భగేల్
author img

By

Published : Aug 27, 2021, 8:34 PM IST

ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​​ భఘేల్​.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో భేటీ అయ్యారు. దిల్లీలోని రాహుల్​ నివాసంలో జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. సీఎం పదవి నుంచి భూపేశ్​​ తప్పుకోనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజకీయాలు, ప్రభుత్వ పాలనపై చర్చించినట్టు భేటీ అనంతరం భూపేశ్​​ మీడియాకు వెల్లడించారు. అయితే సీఎం పదవి మార్పుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

"రాహుల్​కి మొత్తం చెప్పాను. రాజకీయ, ప్రభుత్వ పాలనపై చర్చలు జరిగాయి. ఆయన్ని ఛత్తీస్​గఢ్​కు ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించారు. వచ్చే వారం ఆయన ఛత్తీస్​గఢ్​కు వస్తారు. బస్తర్​ను సందర్శించి, వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఇంతకు మించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు(సీఎం పదవిపై). అన్నీ ముందే చెప్పాను. మా నాయకుడికి అన్నీ చెప్పాను. పీఎల్​ పునియా(ఛత్తీస్​గఢ్​ ఏఐసీసీ ఇన్​ఛార్జ్​)కి అన్ని విషయాలు ముందే చెప్పేశాను."

--- భూపేష్​ భగేల్​, ఛత్తీస్​గఢ్​ సీఎం.

అంతకుముందు.. సీఎంను మార్చవద్దంటూ.. భఘేల్​కు చెందిన మంత్రులు దిల్లీలో బలప్రదర్శన చేశారు. భూపేశ్​​ నేతృత్వంలో ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తోందంటూ పునియాకు వెల్లడించారు.

ఒప్పందం ఇదీ...

2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకునే విధంగా భూపేశ్‌ బఘేల్‌, సింగ్‌ దేవ్‌ మధ్య అవగాహన కుదిరింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌ 17 నాటికే బఘేల్‌ పదవి నుంచి వైదొలిగి సింగ్‌ దేవ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతల్ని అప్పగించాల్సి ఉంది.

గతంలో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ముఖ్యమంత్రి పదవిని టీఎస్ సింగ్‌ దేవ్‌కు అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌ బఘేల్‌ అయిష్టంగానే అంగీకరించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశం వెలువడిన వెంటనే ఆయన రాజీనామా సమర్పిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి.

ఇదీ చూడండి: 'దేశ్​ కా మెంటర్స్'​​ బ్రాండ్​ అంబాసిడర్​గా సోనూసూద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.