Medical student died in Karnataka: సైక్లింగ్ సరదా ఓ వైద్య విద్యార్థిని ప్రాణం తీసింది. సైక్లింగ్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై ముక్కులోంచి రక్తస్రావం కావటం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గురువారం జరిగింది.
ఇదీ జరిగింది..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వైద్య విద్యార్థిని దేవిక సెమినార్ కోసం కర్ణాటకలోని ధార్వాడ జిల్లాకు వచ్చింది. సెలవు రోజులు కావటం వల్ల.. ఉత్తర కన్నడ దండేలి ప్రాంతానికి చేరుకుంది. దండేలి హిడెన్ వ్యాలీలో స్నేహితుల ఇంటిలో ఉంటున్న ఆమే.. గురువారం సరదాగా సైక్లింగ్కి వెళ్లింది. రోడ్డుపై సైకిల్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని తలకి తీవ్ర గాయాలయ్యాయి. ముక్కులో నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న దండేలి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: బిహార్‌లో భారీ పేలుడు- ఎనిమిది మంది మృతి