Chattisgarh girl gangrape: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. 13ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు. జులై 11న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్బా జిల్లా మనేంద్రగఢ్ పట్టణంలోని మౌహార్పురకు చెందిన నిందితులు.. బాలికను కిడ్నాప్ చేశారు. ఇంటి బయట ఆడుకుంటుండగా మైనర్‌ను అపహరించుకుపోయారు. అనంతరం ఆమెను 190 కిలోమీటర్ల దూరంలోని కొరియా జిల్లాకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను నిందితులు హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. జులై 14న బాలికను చైన్‌పుర్ ప్రాంతంలోని ఓ గోదాముకు తీసుకెళ్లి కారులోనే మరోసారి అఘాయిత్యానికి ఒడిగట్టారు. దుండగుల చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఎలాగోలా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సెక్షన్ 363 (కిడ్నాప్), 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: