ETV Bharat / bharat

రైలు పట్టాలపై ఐఐటీ విద్యార్థిని మృతదేహం, కారణాలేంటి - IIT Madras

IIT Madras Student Death ఐఐటీ మద్రాస్​ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మరణించింది. తమిళనాడు చెన్నై సమీపంలో ఆవడి వద్ద రైలు పట్టాలపై ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Chennai IIT Madras Student Death on Train Tracks She is from Odisha

author img

By

Published : Aug 21, 2022, 7:25 AM IST

IIT Madras Student Death: మద్రాస్​ ఐఐటీ విద్యార్థిని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు చెన్నై సమీపంలోని ఆవడి వద్ద శనివారం ఉదయం పట్టాలపై ఓ యువతి తల, ముఖంపై గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంది. సమాచారం మేరకు ఆవడి రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని ఒడిశాకి చెందిన మోహన్‌ పతాన్‌ కుమార్తె మేఘాశ్రీగా (30) గుర్తించారు.

ఈమె దిల్లీలో ఎంట్రెన్స్‌, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్రస్తుతం చెన్నై అడయార్​లోని ఐఐటీలో ఉంటూ మూడు నెలల క్రితం పరిశోధన అధ్యయనాలు చేపట్టినట్లు తెలిసింది. అడయార్‌ నుంచి మేఘాశ్రీ ఆవడి రైల్వేస్టేషన్‌కు ఎందుకు వచ్చిందనేది కీలకంగా మారింది. ఆమె ట్రైన్​ ఎక్కుతూ పడిపోయిందా, వేరే కారణం ఏదైనా ఉందా అని.. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Chennai IIT Madras Student Found Dead on Train Tracks She is from Odisha
మృతురాలు మేఘాశ్రీ

ఇవీ చూడండి: కాటన్​కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్​సీ సిబ్బంది నిర్లక్ష్యం

ఉద్యోగం లేదని మనస్తాపం, 11నెలల చిన్నారిని నదిలో విసిరేసిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.