తమిళనాడుకి చెందిన ఆధ్యాత్మికవేత్త, గాడ్‌మ్యాన్‌గా పేరొందిన సత్యనారాయణన్, అతని భార్య పుష్పలతను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు.
విబూది పేరుతో అత్యాచారం..
చెన్నై వినాయకపురంలోని షిర్డీపురం సర్వశక్తి పీఠం ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న సత్యనారాయణన్ను స్వామిగా ఆరాధిస్తుంటారు. అయితే.. చెన్నైకి చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతున్న సమయంలో ఆమె బంధువులతో పాటు వీరి ఆశ్రమాన్ని సందర్శించింది. ఆ సమయంలో ఆమెకు పవిత్ర విబూది ఇస్తామంటూ నమ్మించిన నిర్వాహకులు ఓ గదిలోకి పిలిచారు. ఈ క్రమంలో 'పుష్పలత' ఓ గ్లాసులో రసాన్ని అందించ్చింది. అది తాగిన బాలిక స్పృహ కోల్పోయింది. రెండు గంటల తర్వాత మెలకువ వచ్చేసరికి.. సత్యనారాయణన్, ఆమె భార్య పుష్పలత సహాయంతో తనపై అత్యాచారం చేశాడని గ్రహించింది. తనను నగ్నంగా ఫొటోలు సైతం తీశారని బాలిక ఆరోపించింది. అయితే దీనిపై ఆయనను నిలదీయగా.. ఈ ఘటన గురించి ఎక్కడా మాట్లాడొద్దని బెదిరించారని వాపోయింది. ఈ ఆరోపణలపై 'గాడ్‌మ్యాన్'ను వివరణ కోరగా.. పాపాలు తొలగించేందుకు పూజలు చేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానిమిచ్చాడని బాలిక బంధువులు తెలిపారు.
వివాహానంతరమూ.. వదలకుండా..
ఈ క్రమంలో.. బాధితురాలికి 2018లో వివాహం జరిగింది. అనంతరం ఆమె భర్త విదేశాలకు వెళ్లాడని తెలుసుకున్న సత్యనారాయన్.. ఆమెకు ఫోన్ చేసి 'నా వద్ద నీ నగ్న చిత్రాలు ఉన్నాయని.. వాటిని నీ భర్తకు చూపుతానంటూ,' బెదిరించాడు. ఆమెను 'ఆశ్రమానికి రావాల్సిందిగా' ఒత్తిడి చేశాడు. అక్కడ మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో ఆమె 2020 జులైలో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న సత్యనారాయణన్, అతని భార్య అబార్షన్ చేయించుకోవాలని బెదిరించారు. దీనితో బాధిత మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అదృష్టవశాత్తూ.. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆమె.. ఈ ఏడాది జనవరిలో బిడ్డకు జన్మనిచ్చింది.
భర్త అండతో..
ఈ ఏడాది నవంబర్‌లో.. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆమె భర్తకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరించింది. దీనిపై భార్యాభర్తలిద్దరూ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం 'గాడ్‌మ్యాన్' సత్యనారాయణన్తో పాటు.. అతని భార్య పుష్పలతను ఆదివారం అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: