ETV Bharat / bharat

చెన్నై మేయర్​గా ఎస్సీ మహిళ... 340ఏళ్ల చరిత్రలో తొలిసారి..

Chennai First SC woman Mayor: 340 ఏళ్ల చరిత్రను చెన్నై కార్పొరేషన్ తిరగరాసింది. తొలిసారి ఓ ఎస్సీ మహిళ చెన్నై మేయర్ పదవికి ఎంపికయ్యారు. డీఎంకే పార్టీ అభ్యర్థి ప్రియా రాజన్​ ఈ పదవిని చేపట్టనున్నారు.

Chennai First SC woman Mayor
Chennai First SC woman Mayor
author img

By

Published : Mar 3, 2022, 8:01 PM IST

Chennai First SC woman Mayor: చెన్నై కార్పొరేషన్​కు తొలిసారిగా షెడ్యూల్ కులాలకు చెందిన ఓ మహిళ మేయర్​గా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల్లో ఈ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయగా.. డీఎంకే ఘన విజయం సాధించింది. చెన్నైలో 153 వార్డులను స్టాలిన్ పార్టీ కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థి ప్రియా రాజన్​ను మేయర్ పదవికి ఎంపిక చేసింది డీఎంకే. తద్వారా.. 340 ఏళ్ల చెన్నై పురపాలిక చరిత్రలో మేయర్ పదవికి ఎన్నికైన తొలి దళిత అభ్యర్థిగా ప్రియా రాజన్ రికార్డు సృష్టించారు.

Chennai First SC woman Mayor
ప్రియా రాజన్

గతంలో పలువురు మహిళలు చెన్నై పీఠాన్ని అధిరోహించారు. అయితే, దళిత మహిళ పదవిని చేపట్టడం మాత్రం ఇదే తొలిసారి. 1957లో తారా సెరియన్ అనే మహిళ తొలిసారి చెన్నై కార్పొరేషన్​కు మేయర్​గా సేవలు అందించారు. అనంతరం 1971-72 మధ్య కామాచ్చి జయరామన్.. ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా నిలిచారు.

ఇదీ చదవండి: క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.కోట్ల మోసం.. హైదరాబాద్​లో ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.