400 ఏళ్లనాటి పురాతన వినాయక విగ్రహాన్ని(ganesha idol) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పట్టుకున్నట్లు చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.
విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 'నృత్య గణపతి' విగ్రహం(antique ganesha idol) కాంచీపురంలోని ఓ ఇంటిలో ఉన్నట్లు వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ వినాయక విగ్రహం(antique ganesha statue) 130 కిలోల బరువు, 5.25 అడుగుల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. ఇత్తడితో చేసినట్లు తెలిపారు.
విగ్రహాల స్మగ్లింగ్‌కు సంబంధం ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. చెన్నై కస్టమ్స్ విభాగం సీజ్ చేసిన విగ్రహాల్లో ఇదే అతిపెద్దదని చెప్పారు.
ఇదీ చూడండి: రూ.35కోట్ల విలువైన పురాతన విగ్రహాల పట్టివేత