బంగారం స్మగ్లింగ్ కోసం దుండగులు రోజుకో కొత్త దారిని వేతుకుతున్నారు. తమిళనాడు చెన్నైలోని విదేశీ పోస్ట్ ఆఫీస్‌లో అక్రమంగా తరలిస్తున్న 2.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ కోటీ 20లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి.. టాంగ్ అనే ఇన్స్టాంట్ డ్రింక్ పౌడర్‌లో కలిపి తరలిస్తున్నట్లు గుర్తించారు.
దుబాయ్ నుంచి వచ్చిన ఈ పార్సెల్‌పై చెన్నైలోని ఓ వ్యక్తి అడ్రస్ ఉన్నట్లు తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి అడ్రస్‌ను అక్రమంగా వాడుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి : కొవిడ్ మృతదేహాన్ని గంగానదిలోకి విసిరిన వ్యక్తులు