నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అనూహ్యంగా పీసీసీ పదవికి(punjab congress committee) రాజీనామా చేయటం వల్ల పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రరూపం(punjab congress crisis) దాల్చింది. ఈ నేపథ్యంలో బుధవారం అత్యవసరంగా కేబినెట్ సమావేశం(punjab cabinet meeting today) ఏర్పాటు చేశారు నూతన ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ. అనంతరం.. రాష్ట్రంలో పలు నియామకాలపై అకలబూనిన సిద్ధూతో మాట్లాడినట్లు చన్నీ తెలిపారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితులను గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ హరీశ్ రావత్ పేర్కొన్నారు.
కూర్చొని మాట్లాడుకుందాం..
రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై పార్టీ నేతలంతా కూర్చొని మాట్లాడుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. తాను ఇప్పటికే నవజ్యోత్ సింగ్ సిద్ధూతో మాట్లాడానని వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్(sidhu resignation news) పదవికి నిన్న సిద్ధూ రాజీనామా చేయడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపర్చింది. దాంతో పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు చన్నీ పూనుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
"రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడటానికి నాకు ఎలాంటి అహం లేదు. నేతలందరితో కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల కోసం కలిసి పనిచేయగలం. అన్నింటికి మించి పార్టీ అత్యున్నతమైందని నేను సిద్ధూకి స్పష్టం చేశాను. విభేదాలను తొలగించుకునేందుకు మాట్లాడుకుందాం అని చెప్పాను''
--చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ముఖ్యమంత్రి.
పార్టీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. ఈ రోజు ట్విటర్ వేదికగా వీడియో విడుదల చేశారు. తన తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతానని, అవినీతి మరకలు అంటిన నేతల్ని అనుమతించబోమని ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.
పెండింగ్ కరెంట్ బిల్లుల మాఫీ..
పంజాబ్‌లో 2కిలో వాట్ల వరకు విద్యుత్ కనెక్షన్ ఉన్నవారికి పెండింగ్ కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చన్నీ తెలిపారు. ఈ భారాన్ని ప్రభుత్వమే మోయనుందని వెల్లడించారు. దీంతో ప్రభుత్వంపై రూ. 1200 కోట్ల వరకు భారం పడనుంది.
విద్యుత్ బిల్లులు కట్టలేని కారణంగా చాలా మంది ప్రజలు.. ఇళ్లల్లో విద్యుత్ కోతకు గురైనట్లు చన్నీ పేర్కొన్నారు. దాదాపు 55 వేల నుంచి లక్ష మంది కరెంట్ బిల్లులు కట్టలేక కనెక్షన్ కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల మంది 2కిలో వాట్ల కరెంట్ లోడ్‌ను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బిల్లుల మాఫీతో పాటు.. తొలగించిన కనెక్షన్ పునరుద్ధరిస్తామని సీఎం వెల్లడించారు.
భద్రతను తగ్గించండి..
భద్రతా సిబ్బందిని తగ్గించమంటూ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ(Punjab cm security) మరోసారి రాష్ట్ర పోలీసు శాఖను కోరారు. కనీస సంఖ్యలో భద్రతా సిబ్బంది తనతో ఉంటే చాలని ఆయన అధికారులను కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. దీనిపై సమీక్షించనున్నట్లు పంజాబ్ అదనపు డీజీపీ బాధ్యతలు చేపట్టిన ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతా తెలిపారు.
పరిస్థితులను గమనిస్తున్నాం..
తమ పార్టీలో తలెత్తిన పరిస్థితులను పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ హరీశ్ రావత్ గమనిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా తెలిపారు. ఈ మేరకు ఆయన దిల్లీ నుంచి పంజాబ్ రానున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: